సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ విశాఖ
ABN , First Publish Date - 2021-03-22T05:24:19+05:30 IST
నిడదవోలులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళా శాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల పురుషులు, మహిళల సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి.

నిడదవోలు, మార్చి 21: నిడదవోలులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళా శాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల పురుషులు, మహిళల సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మూడు రోజులుగా 13 జిల్లాల నుంచి వచ్చిన 26 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల విభాగంలో విశాఖ విన్నర్‌గా, తూర్పుగోదావరి రన్నర్‌గా నిలి చాయి. మహిళల విభాగంలో విశాఖ విన్నర్‌గా, గుంటూరు రన్నర్‌గా నిలి చాయి. విశాఖ పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది. కాగా జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జైపూర్‌లో జరుగనున్నాయని, ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళల, పురుషుల జట్లను ఎంపిక చేశామని పశ్చిమ గోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది. మహిళల జట్టు .. కె.దేవిక (విశాఖ), ఎం.రాధా స్రవంతి (విశాఖ), డి. శ్రావణి (గుంటూరు), పి.శిరీష (పశ్చిమ గోదావరి), ఎం.శ్వేత (నెల్లూరు), పి.పెర్సి జ్యోతి (గుంటూ రు), ఆర్. కావ్యశ్రీ (విశా ఖ), ఎస్. కుసుమ కుమారి (తూర్పు గోదా వరి), ఎం. సుభద్ర (కృష్ణా), ఎస్. షహీరా అంజమ్ (కర్నూలు), స్టాండ్‌బై ప్లేయర్స్‌గా.. బి. కావ్య (ప్రకాశం), ఐ.ప్రణవి (అనంత పురం), పి.నిరోషా (చిత్తూరు).
పురుషుల జట్టు .. డి.రమేష్ (విశాఖ), వైవివీ శివకుమార్ రెడ్డి (తూర్పు గోదావరి), ఆర్.వేణు (విశాఖ), బి.జోహార్ రెడ్డి (కర్నూ లు), ఎన్.ధనుంజయ్ (అనంతపురం), ఎం.వి.ఎస్. సురేష్ (కర్నూలు), ఎన్‌కె. పఠామియ్యా (ప్రకాశం), కె. రూపేంద్ర (చిత్తూ రు), సీహెచ్. కృష్ణ (తూర్పు గోదావరి), బి.సతీష్ కుమార్ (పశ్చిమ గోదావరి), స్టాండ్‌బై ప్లేయర్స్‌గా పి.లక్ష్మణరావు (విజయనగరం), ఫిరోజ్ (కడప), ఈవీ రమణ (నెల్లూరు).