రోడ్డు ప్రమాదాలు నివారించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-19T04:37:06+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలు నివారించాలి: కలెక్టర్‌
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏప్రిల్‌ నెలలో 42 మంది మృత్యువాత

ఏలూరు, మే 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌లో 42 మంది చనిపోయారని, అందులో 23 మంది జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లోనే చనిపోయారని, వాటిని నివారించేందుకు ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ అధికారులు నివేదికను త్వరగా అందించాలని ఆదేశించారు. సైన్‌ బోర్డులు, రోడ్ల ఎలైన్‌మెంట్‌, రోడ్డు రిపేర్లపై నివేదిక ఇవ్వాలన్నారు. 


Updated Date - 2021-05-19T04:37:06+05:30 IST