మరో 1642 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2021-05-22T05:03:26+05:30 IST
జిల్లావ్యాప్తంగా శుక్రవారం 1,634 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, ఆరుగురు మరణించారు.

ఏలూరు ఎడ్యుకేషన్, మే 21: జిల్లావ్యాప్తంగా శుక్రవారం 1,634 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, ఆరుగురు మరణించారు. ఆసుపత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 15,069కి పెరిగింది. కొత్తగా 46 కంటైన్మెంట్ జోన్‌లు ఏర్పా టు కానున్నాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం వంటి పట్ట ణ ప్రాంతాలతోపాటు ఆచంట, అత్తిలి, భీమడోలు, బుట్టాయిగూ డెం, చాగల్లు, చింతలపూడి, దెందులూరు, దేవరపల్లి, ద్వారకాతిరు మల, గణపవరం, గోపాలపురం, ఇరగవరం, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, లింగపాలెం, మొగల్తూరు, నల్లజర్ల, నిడమర్రు, పాలకోడేరు, పెదపాడు, పెదవేగి, పెంటపాడు, పెను గొండ, టి.నర్సాపురం మండలాల్లో అధిక కేసులు నమోదయ్యాయి.
ప్రైవేటుకు కోవాగ్జిన్
పరిశీలనలో రెండు ఆసుపత్రులు.. డోస్ రూ.1200
తాడేపల్లిగూడెం, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆసుపత్రుల్లోను ఇకపై కొవిడ్ వ్యాక్సినేషన్ చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో రెండు ఆసుపత్రుల్లో కోవాగ్జిన్ వేసేందుకు అనుమతులు ఇవ్వాలని అధికా రులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్ప టికే ఈ ప్రక్రియ ఇతర జిల్లాల్లో ప్రారం భించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం పట్ట ణాల్లో చెరో ఆసుపత్రిని ఎంపిక చేయను న్నారు. వ్యాక్సిన్ వేసేందుకు ముందుకొచ్చిన ప్రైవేటు ఆసుపత్రులను సంబంధిత అధికారులు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే వ్యాక్సినేషన్‌కు ఆమోదముద్ర వేస్తారు. ఆయా ఆసుపత్రులు నేరుగా డీడీ లు చెల్లిస్తే.. కంపెనీలే వ్యాక్సిన్‌ను కేటాయిస్తాయి. గతంలోనూ ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవాగ్జిన్, ప్రభుత్వాసుపత్రుల్లో కోవిషీల్డ్ టీకాను ఉపయో గించారు. తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ను నిలుపుదల చేసింది. తాజాగా ఈ రెండు ఆసుపత్రులకు వ్యాక్సినేషన్‌కు అనుమతులు ఇచ్చేందు కు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆసుపత్రుల్లో వేసే వ్యాక్సిన్ ఒక డోస్‌కు రూ.1,200 వసూలు చేయనున్నారు.
24 నుంచి వ్యాక్సినేషన్
ఏలూరుఎడ్యుకేషన్, మే 21 : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని ఈ నెల 24వ తేదీ సోమవారం నుంచి ప్రారంభించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. జిల్లాలో 58 వేల డోసుల కోవిషీల్డ్, 10 వేల డోసుల కోవాగ్జిన్ నిల్వలు ఉన్నాయి. కోవిషీల్డ్‌ను సీనియర్ సిటిజన్లకు తొలి డోసు పంపిణీ నిమిత్తం వినియోగిస్తూనే, 84 రోజుల గడువు పూర్తయ్యి రెండో డోసుకు అర్హత సాధించిన లబ్ధిదారులకు వినియోగిస్తారు. కోవాగ్జిన్ రెండో డోసు లబ్ధిదారులు 30 వేల మంది వరకు ఉండగా సీనియార్టీని గుర్తించి, అందు బాటులో వున్న నిల్వల మేరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు మరిన్ని నిల్వలు దిగుమతి కానున్నాయి.