బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.5,90,124 అపహరణ

ABN , First Publish Date - 2021-05-21T04:01:16+05:30 IST

ఓ అరిచితుడు లైన్‌లోకి వచ్చి ఎనీడెస్క్‌ అనే మొబైల్‌ యాప్‌ను బాధితుడి చేత ఇన్‌స్టాల్‌ చేయించాడు. బాధితుడి లాగిన్‌ ఐడీ, పాస్వర్డ్‌లను ఏనీడెస్క్‌ యాప్‌ ద్వారా అపరిచితుడు గమనించి బాధితుడి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ బ్రాంచ్‌ అకౌంట్‌ నుంచి మొత్తం 14 సార్లు, రూ.5,90,124లను తీసేశాడు.

బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.5,90,124 అపహరణ

జంగారెడ్డిగూడెం, మే 20 : జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఈనెల 15వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో నగదు పే చేసి బుక్‌ చేసిన మూడు పరుపులు కొవిడ్‌ కారణంగా ఆర్డర్‌ రద్దు చేసినట్టు ఫ్లిప్‌కార్ట్‌ మెస్సేజ్‌ పంపింది. అదే రోజు బాధితుడు గూగుల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం వెతకగా ఒక నెంబర్‌ను గుర్తించాడు. వెంటనే ఆ నెంబర్‌కు బాధితుడు ఫోన్‌ చేసి మాట్లాడగా ఓ అరిచితుడు లైన్‌లోకి వచ్చి ఎనీడెస్క్‌ అనే మొబైల్‌ యాప్‌ను బాధితుడి చేత ఇన్‌స్టాల్‌ చేయించాడు. బాధితుడి లాగిన్‌ ఐడీ, పాస్వర్డ్‌లను ఏనీడెస్క్‌ యాప్‌ ద్వారా అపరిచితుడు గమనించి బాధితుడి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ బ్రాంచ్‌ అకౌంట్‌ నుంచి మొత్తం 14 సార్లు, రూ.5,90,124లను తీసేశాడు.  బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం కంపెనీల నోడల్‌ అధికారులకు ఇ–మెయిల్‌ సందేశం పంపారు. వెంటనే స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌ అధికారులు మోసగాడు బుక్‌ చేసిన వివిధ రకాల ఆన్‌లైన్‌ ఆర్డర్‌లను రద్దు చేసి వెంటనే రూ.4,65,126లను రికవరీ చేయించారు. మిగిలిన డబ్బును అప్పటికే కోల్‌కత్తా, జార్ఖండ్‌లోని వివిధ ఏటీఎం సెంటర్‌ల నుంచి విత్‌డ్రా చేసినట్టు గుర్తించారు. 


Updated Date - 2021-05-21T04:01:16+05:30 IST