ఆక్సిజన్‌ బస్సు ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-25T05:27:20+05:30 IST

నిడదవోలు శేషగిరి కొవిడ్‌ ఆసుపత్రి ఆవరణలో జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు ఆక్సిజన్‌ బస్సును ప్రారంభించారు.

ఆక్సిజన్‌ బస్సు ప్రారంభం

నిడదవోలు, మే 24: ప్రభుత్వం కరోనా బాధి తుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నదని రాజమహేం ద్రవరం ఎంపీ  మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. సోమవారం నిడదవోలు శేషగిరి కొవిడ్‌ ఆసుపత్రి ఆవరణలో జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు ఆక్సిజన్‌ బస్సును  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇప్పటికే రాజమండ్రిలో రెండు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు నిడదవోలులో కొవిడ్‌ రోగుల కోసం బస్సును ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, డాక్టర్‌ తోపరాల కళ్యాణ చక్రవర్తి, ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, ఎమ్మార్వో ఎం.గంగరాజు, మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతి ఉన్నారు.


Updated Date - 2021-05-25T05:27:20+05:30 IST