బావను హతమార్చిన బావమరిది అరెస్టు
ABN , First Publish Date - 2021-05-22T04:37:55+05:30 IST
బావను హతమార్చిన బావమరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరు క్రైం, మే 21 : బావను హతమార్చిన బావమరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులోని నాగేంద్ర కాలనీ, నక్కలోళ్ళ వీధిలో నివాసం ఉంటున్న ఎల్లమ్మ (31)కి భర్త పవర రాజేష్ అలియాస్ రాజు (37) ఒక కుమార్తె ఉన్నారు. పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. పూసల కోసం తమిళనాడు వెళ్తూ వస్తూ ఉండేవాడు. అక్కడ ఒక యువతితో పరిచయం కావడంతో ఆమెను రెండవ భార్యగా చేసుకున్నారు. నెలకు ఒకటి రెండు సార్లు మొదటి భార్య ఎల్లమ్మ వద్దకు వచ్చి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో ఎల్లమ్మ మచిలీపట్టణంలోని చేపల మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న తన సోదరుడు తంగ పాండ్యన్ అలియాస్ బంగారం (29)కు చెప్పడంతో ఈనెల 20వ తేదీన వచ్చాడు. అప్పటికే పవర రాజు ఎల్లమ్మను కొడుతున్నాడు. దీంతో ఆగ్రహించిన బంగారం కత్తితో రాజేష్‌ను నరికేశాడు. అక్కడికక్కడే మరణించాడు. ఈ కేసులో నిందితుడైన పాండ్యన్‌ను అరెస్ట్ చేశారు.