అరాచక పాలన సాగదు

ABN , First Publish Date - 2021-10-22T04:32:59+05:30 IST

తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి.

అరాచక పాలన సాగదు
గృహ నిర్బంధంలో పాలి ప్రసాద్‌

చంద్రబాబుకు బడేటి చంటి సంఘీభావం 

 గృహ నిర్బంధాల్లో టీడీపీ నాయకులు

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, అక్టోబరు 21: తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై  గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు టీడీపీ ప్రధాన కార్యా లయం పైనా, నాయకుల ఇళ్ల పైనా దాడి చేయడాన్ని నిరసిస్తూ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు మంగళగిరిలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలపడా నికి వెళ్లే కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్‌ను అడ్డుకోవడానికి పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. బుధవారం టీడీపీ బంద్‌ను అడ్డుకోవడానికి శతవిధాలా ప్ర యత్నించారు. మరల చంద్రబాబునాయుడు గురువారం దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించగానే మళ్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి నుంచే టీడీపీ నాయకు లను గృహనిర్బంధం చేయడం ప్రారంభించారు. అయితే టీడీపీ ఏలూరు నియో జకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని మళ్లీ గృహ నిర్బంధం చేసే లోపే బుధవారం అర్ధరాత్రికే విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో చంద్ర బాబు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. ప్రతిపక్షాలు ఏమైనా తప్పులు చేస్తే కేసులు పెట్టాలి. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాని మంత్రులే వైసీపీ కార్యకర్త లను రెచ్చగొట్టి టీడీపీ నేతల ఇళ్లపై ఉసి గొల్పడం తగదన్నారు. హోం మంత్రి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సిగ్గు చేట న్నారు. మంత్రి అనిల్‌కుమార్‌ ప్రతిపక్షాలపై ఛాలెంజ్‌లు విసరడం అసహ్యంగా ఉంద న్నారు. రాష్ట్రంలో బిహార్‌ల పరిస్థితి దాపురించిందని, రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోందన్నారు. ప్రజలు మంచి పరిపాలన కావాలో, గూండా రాజ్యం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరు వ్వడంతో పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఏలూరు నగరంలో టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులుతో పాటు ప్రధాన నాయకులను విజయ వాడ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని ఎక్కడి వారిని అక్కడే నిర్బంధించారు. ఎంత కాలం ఈ అరాచక పాలన అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా శుక్రవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా విజయవాడ వెళ్లి చంద్ర బాబు నాయుడుకు సంఘీభావం ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నారు. 


వైసీపీ ప్రభుత్వానిది.. అరాచక పాలన 

ఏలూరు రూరల్‌, అక్టోబరు 21 : రాష్ట్రంలో వైసీపీది అవినీతి, అరాచక ప్రభుత్వ మని రూరల్‌ మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు నేతల రవి, మాజీ వైస్‌ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడికి దిగడం అమానుషమన్నారు. టీడీపీ కార్యాలయా లు, నేతల ఇళ్లపై వైసీపీ నాయకులు చేస్తున్న దాడులు దుర్మార్గమన్నారు.  వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ మూల చూసినా ఏదో ఒక అరాచకం జరుగుతూనే ఉందన్నారు. వైసీపీ దాడులను ప్రజలు గమనిస్తు న్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. 

Updated Date - 2021-10-22T04:32:59+05:30 IST