నాలుగు మండలాల్లో 12 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-08-03T05:47:18+05:30 IST

ఏలూరు రూరల్‌ మండలంలో సోమవారం రెం డు కరోనా కేసులు నమోదయినట్టు మండల వైద్యశాఖ అధికారి డాక్టర్‌ దేవ్‌ మనోహర్‌ కిరణ్‌ తెలిపారు.

నాలుగు మండలాల్లో 12 కరోనా కేసులు నమోదు
పాలగూడెంలో బ్లీచింగ్‌ చల్లుతున్న దృశ్యం

ఏలూరు రూరల్‌, ఆగస్టు 2: ఏలూరు రూరల్‌ మండలంలో సోమవారం రెం డు కరోనా కేసులు నమోదయినట్టు మండల వైద్యశాఖ అధికారి డాక్టర్‌ దేవ్‌ మనోహర్‌ కిరణ్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇన్‌ఛార్జి ఎంపీడీవో సరళకుమారి తెలిపారు. కాగా ఇటీవల జాలిపూడిలో మలేరియా కేసు నమోదు కావడంతో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. 

దెందులూరు : రామారావుగూడెం, గోపన్నపాలెం, గాలాయగూడెం, కొవ్వ లి, దోసపాడు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.

పెదపాడు : పెదపాడు మండలం వట్లూరు పీహెచ్‌సీ పరిధిలోని ఏపూ రులో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో ఎటువంటి కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు.

పెదవేగి : పెదవేగి మండలంలో సోమవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు వైద్యశాఖ సిబ్బంది తెలిపారు.


310 మందికి వ్యాక్సినేషన్‌

దెందులూరు, ఆగస్టు 2 : కరోనాను నియత్రించేందుకు అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, జా గ్రత్తలు పాటించాలని తహసీల్దార్‌ వి.నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మీ అన్నారు. సోమవారం నాగ హనుమాన్‌ పరిశ్రమలో పని చేస్తున్న 45 ఏళ్లు దాటిన కార్మికులకు కరోనా నివారణ వ్యాక్సిన్‌ మొదటి డోసు వేసే కార్యక్రమాన్ని తహసీల్దార్‌ పరిశీలించారు. గోపన్నపాలెం, దెందులూరు పీహెచ్‌సీల పరిధిలో 180 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేశారు.

పెదవేగి :మండలంలో సోమవారం 130 మందికి కరోనా నివారణ టీకా వేసినట్టు తహసీల్దారు బి.సుందర్‌సింగ్‌ చెప్పారు. పినకడిమి, కొప్పులవారిగూడెం, లక్ష్మీపురం, కవ్వగుంట గ్రామాల్లో లబ్ధిదారులకు టీకాలు వేసినట్టు తెలిపారు. పెదవేగి ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌, ఎంపీడీవో ఎం.బలరామరాజు టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 

Updated Date - 2021-08-03T05:47:18+05:30 IST