చిన వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2021-08-21T05:34:54+05:30 IST

ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

చిన వెంకన్న ఆలయంలో   పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవ పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

ద్వారకా తిరుమల, ఆగస్టు 20 : ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు అంకురార్పణ వాస్తుపూజ, వాస్తు హోమం నిర్వహించారు. ఆలయంలో సుదర్శన హోమం రెండో రోజు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను తొలక్కం వాహనంపై ప్రత్యేకాభరణాలతో అలంకరించి ఆశీనులు గావింప చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి సన్నిధి నుంచి నిత్యార్జిత కల్యాణ మండపం వద్దకు తోడ్కుని వచ్చారు. రజత సింహాసనంపై స్వామి, అమ్మవార్లను ఆశీసునులు గావించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి రాంబాబు, అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో మహామంత్ర సహిత సుదర్శన హోమం నిర్వహించారు. ఈవో సుబ్బారెడ్డి, చైర్మన్‌ ఎస్‌వీ సుధాక రరావు కుమారుడు నివృతరావు,  సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T05:34:54+05:30 IST