జోరువాన

ABN , First Publish Date - 2021-08-22T05:18:11+05:30 IST

ఏకధాటిగా శనివారం కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

జోరువాన
ఏలూరులో కురుస్తున్న వర్షం

పల్లపు ప్రాంతాలు జలమయం.. నీటమునిగిన  పండ్ల తోటలు

అధ్వానంగా రహదారులు..వాహనదారుల పాట్లు

ఏలూరు రూరల్‌, ఆగస్టు 21: ఏకధాటిగా శనివారం కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు కాల్వ లను తలపించాయి. అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు మరింత అధ్వానం గా మారాయి. ఏలూరు నగరంతో పాటు మండలంలో భారీ వర్షం కురి సింది. పవర్‌పేట, వర్దినీడి కృష్ణమూర్తి వీధి, ఆర్‌ఆర్‌పేటల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం పది గంటలకు మొదలైన వర్షం మధ్యాహ్నం 2 గంటల వరకూ వర్షం కురుస్తూనే ఉంది. కాగా ఇప్పటికే అధ్వానంగా ఉన్న రహదారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరింత దారుణంగా మారాయని వాహనదారులు వాపోతున్నారు. ఫిల్‌హౌస్‌ పేటలో రోడ్లపైన గోతులు వర్షం నీటితో నిండడంతో వాహనదారులు ఇబ్బందు లు పడ్డారు. కాగా పది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాత లు వానలు కురుస్తుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

పెదవేగి : మండలంలో శనివారం ఒక్కసారిగా కురిసిన భారీవర్షంతో వాగులు, వంకలు వరదనీటితో పోటెత్తాయి. రెండుగంటల పాటు వర్షం ఏకధాటిగా కురవడంతో రహదారులు కాల్వలను తలపించాయి. నిమ్మ, కొబ్బరి, పామాయిల్‌ వంటి పండ్లతోటల్లో వర్షపునీరు నిలిచింది. గోపన్నపాలెం– బాదరాల ప్రధాన రహదారిలో లక్ష్మీపురం దగ్గర వర్షపునీరు రహదారిపై చేరి కాల్వను తలపించింది. ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు.

పెదపాడు : ఏకధాటిగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మండలం లోని గ్రామాలు తడిసిముద్దయ్యాయి. దీంతో రోడ్లపై నీరు కాల్వల్లా ప్రవహించిం ది. దీనికి తోడు డ్రెయిన్లలోని మురుగు నీరు సైతం వర్షపునీటితో కలవడంతో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. శనివారం 1.4 మి.మి. వర్షపాతం నమోదైనట్టు అధికా రులు తెలిపారు. వర్షంతో రైతులు, ఆక్వా కూలీలు, పాఠశాలలకు వెళ్లిన విద్యా ర్థులు సైతం తడిసి ముద్దయ్యారు. గుడిపాడులోని ఆర్‌.సి.ఎం. పాఠశాలలోకి శనివారం వర్షపునీరు చేరడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. పాఠశాల చుట్టూ రోడ్లు మెరకగా ఉండటం, పాఠశాల ఆవరణ లోతట్టుగా ఉండటంతో నీరంతా పాఠశాలలోకి చేరింది. దీంతో ఉపాధ్యా యులు అలానే పాఠ్యాంశాలు బోధించాల్సి వచ్చింది. 

Updated Date - 2021-08-22T05:18:11+05:30 IST