369 వలంటీర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు
ABN , First Publish Date - 2021-05-06T05:00:25+05:30 IST
జిల్లాలో ఖాళీగా ఉన్న 369 వలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

ఏలూరుసిటీ, మే 5: జిల్లాలో ఖాళీగా ఉన్న 369 వలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయి ంచారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఈ దరఖాస్తు చేసు కోవచ్చునని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా ప్రకటించారు.అభ్యర్థులు కనీసం 10తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 5–5–2021 నాటికి 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలు దాటని వారై ఉండాలి. నిబంఽధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్థాయి.