భీమవరంలో ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-05-18T05:42:38+05:30 IST

జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో జిల్లా ఆర్టీసీ ఇన్‌చార్జీ ఆర్‌ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు డిపోల్లో ఉన్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌

భీమవరంలో ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌
భీమవరం బస్‌ డిపోలో సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

భీమవరం క్రెం, మే 17 :  జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో జిల్లా ఆర్టీసీ ఇన్‌చార్జీ ఆర్‌ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు డిపోల్లో ఉన్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌ వేసినట్టు భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్‌ మహేంద్రుడు సోమవారం తెలిపారు.భీమవరం నరసాపురం, తాడేపల్లిగూడెం డిపోలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి సుమారు 160 మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు తెలిపారు. ఆర్టీసీ సీఐ సుధారాణి, వన్‌టౌన్‌ సీఐ కృష్ణభగవాన్‌, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2021-05-18T05:42:38+05:30 IST