నరసాపురం–నిడదవోలుకు మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు

ABN , First Publish Date - 2021-07-18T05:02:00+05:30 IST

నరసాపురం– నిడదవోలు మధ్య మధ్యాహ్న సమయంలో మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుపుతున్నట్లు నరసాపురం రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ మధుబాబు చెప్పారు.

నరసాపురం–నిడదవోలుకు మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు

నరసాపురం, జూలై 17: నరసాపురం– నిడదవోలు మధ్య మధ్యాహ్న సమయంలో మరో ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుపుతున్నట్లు నరసాపురం రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ మధుబాబు చెప్పారు. 07772 నెంబర్‌తో నడిచే ఈ రైలు నరసాపురంలో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి నిడదవోలుకు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో 07771 నెంబర్‌తో రాత్రి 6.45 బయలుదేరి నరసాపురం 9.20కి చేరుకుంటుందన్నారు. ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, పెన్నాడ, భీమవరం జంక్షన్‌, ఆరవల్లి, అత్తిలి, తణుకు, కాల్దరి స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. 

Updated Date - 2021-07-18T05:02:00+05:30 IST