పేదలకు ఉన్నత విద్య దూరం

ABN , First Publish Date - 2021-01-21T04:23:57+05:30 IST

పేదలకు ఉన్నత విద్యను ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి దూరం చే స్తున్నారని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు మహేష్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలకు ఉన్నత విద్య దూరం
సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మహేష్‌

జీవో నెంబరు 77  రద్దు చేయాలి..

22న సీఎం కార్యాలయం ముట్టడిస్తాం

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మహేష్‌


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జనవరి 20: పేదలకు ఉన్నత విద్యను ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి దూరం చే స్తున్నారని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు మహేష్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు జీవో నెంబరు 77ను తీసుకొచ్చారన్నారు.  ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోకు వినతిపత్రాలు సమర్పించామని, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోం దన్నారు. జీవో నెంబరు 77ను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 22న ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌ మాట్లాడుతూ  జీవో నెంబరు 77ను రద్దు చేయకపోతే ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. కార్యక్రమంలో ఎం.అభిషేక్‌, ఎ.మణికంఠ, డి.మహేష్‌, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-21T04:23:57+05:30 IST