మంగపేటలో పులి సంచారం?

ABN , First Publish Date - 2021-03-15T05:09:50+05:30 IST

మంగపేటలో పులి తిరుగుతుందంటూ గ్రామస్థులు భయందోళనకు గురవుతు న్నారు.

మంగపేటలో పులి సంచారం?
పులి అడుగులుగా భావిస్తున్న ముద్రలు

కొయ్యలగూడెం, మార్చి 14: మంగపేటలో పులి తిరుగుతుందంటూ గ్రామస్థులు భయందోళనకు గురవుతు న్నారు. శనివారం ఆ గ్రామంలోని ఒక పొగాకు తోటలో పులిజాడల్ని గ్రామ స్థులు కనుగొన్నారు. ఇది ఇలా ఉండగా ఆదివారం నాడు ఆ గ్రామానికి చెందిన సంసాని సత్యనారాయణ తన పొలంలో పులి కనిపించిందని పరుగె త్తుకుంటూ గ్రామంలోకి వచ్చాడు. పులిని చూశానని చెప్పడంతో గ్రామస్థులంతా భయందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-03-15T05:09:50+05:30 IST