జగన్‌ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు

ABN , First Publish Date - 2021-08-21T05:18:31+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ పాలన వచ్చిన నాటి నుంచి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువ య్యాయని తెలుగు యువత ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు రెడ్డి సూర్య చంద్రరావు అన్నారు.

జగన్‌ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ యువత అధ్యక్షుడు సూర్య చంద్రరావు

తెలుగు యువత ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు రెడ్డి సూర్యచంద్రరావు 

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, ఆగస్టు 20: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ పాలన వచ్చిన నాటి నుంచి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువ య్యాయని తెలుగు యువత ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు రెడ్డి సూర్య చంద్రరావు అన్నారు. ఏలూరు టీడీపీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య చంద్రరావు మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టేందుకు దిశ చట్టం తెచ్చామని 21 రోజుల్లోపు దోషి అని తెలిస్తే ఉరిశిక్ష విధిస్తామని ముఖ్య మంత్రి జగన్‌ అట్టహాసంగా ప్రక టించారన్నారు. తీరా  ఆ చట్టాన్ని నిర్వీర్యంగా మార్చారన్నారు. రెండేళ్ల వైసీపీ పాలనలో  500 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. జరిగిన ప్పటికీ ఏ ఒక్కరికి కూడా శిక్ష పడలేదన్నారు. గుంటూరులో పట్టపగలు నడిరోడ్డు మీద బిటెక్‌ విద్యార్ధి రమ్యను అత్యంత దారుణంగా హత్య చేసి  నిందితుడిపై దిశ చట్టం కింద  కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలుగు యువత సెక్రటరీ రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటే వారిపై కేసులు పెడుతున్నారని మహిళలపై అఘాయిత్యాలు చేసేవారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. రమ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌.నాగేంద్రబాబు, ఎన్‌.రాజు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T05:18:31+05:30 IST