పెట్రో ధరలపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-11-10T05:18:50+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు మంగళవారం ఏలూరు నగరంతో పాటు ఏలూరు రూరల్‌ , పెదపాడు, పెదవేగి మండలాల్లో పెట్రోల్‌ బంకుల వద్ద నిరసన తెలిపారు.

పెట్రో ధరలపై టీడీపీ నిరసన
లింగారావుగూడెం పెట్రోలు బంకు వద్ద టీడీపీ నాయకుల నిరసన


ఏలూరు టూటౌన్‌, నవంబరు 9 :
పెట్రోలు, డీజిల్‌ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు మంగళవారం ఏలూరు నగరంతో పాటు ఏలూరు రూరల్‌ , పెదపాడు, పెదవేగి మండలాల్లో పెట్రోల్‌ బంకుల వద్ద  నిరసన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై గగ్గోలు పెట్టిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక పెట్రోలు, డీజిల్‌పై అధికంగా వ్యాట్‌ విధించారని ధ్వజమెత్తారు. దీనిప్రభావం అన్ని రంగాలపై పడిందని, ప్రజలు ధరల భారం మోయలేక పో తున్నారని తక్షణం పెట్రో ధరలు తగ్గించాలని  డిమాండ్‌ చేశారు.  

 కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా పెట్రో లు, డీజిల్‌ ధరలు రాష్ట్రంలో తగ్గించకపోతే వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్టాండ్‌ వద్ద పెట్రోలు, డీజి ల్‌ ధరలు తగ్గించాలంటూ మంగళవారం ధర్నా నిర్వహించారు. చంటి మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్‌ లీటరుకు రూ.15 నుంచి రూ.20లు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ పెట్రోలుపై రూ.2లు పెంచితే నానా యాగి చేశారని, ఇప్పుడు ఏకంగా పెట్రోలుపై రూ.30కి పైగా అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. రోడ్డు సెస్సు పేరుతో అదనంగా మరో రూపాయి వసూలు చేస్తున్నారని, రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు వేశా రో చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ చోడే వెంకటరత్నం, నెరుసు గంగరాజు, మాజీ ఎఎంసి చైర్మన్‌ పూజారి నిరంజన్‌, జాలా బాలాజీ, మారం హనుమంతరావు, పెద్దిబోయిన శివప్రసాద్‌ పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌ : రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి విమర్శించి అధికారంలోకి వచ్చాక ధరలు ఆకాశాన్నంటేలా చేశారని రూరల్‌ మండల తెలుగుదేశం పార్టీ నాయ కులు విమర్శించారు. పెట్రో పోటుపై రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు నంబూరి నాగరాజు ఆధ్వర్యంలో మాదేపల్లి శివారు లింగారావుగూడెం ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎక్క డా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై ప్రభుత్వం అధికంగా వ్యాట్‌ విధి స్తూ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పత్రికా ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నేతల రవి మాట్లాడుతూ అధికార పార్టీ విధానం వలనే పెట్రో, డీజిల్‌ ధరలు పెరిగిపోయా యన్నారు. పెట్రో ధరలు అధికంగా ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయని, రాష్ట్రా నికి ఆదాయం ఎలా పెరుగు తుందని ప్రశ్నించారు. డీజిల్‌ ధరల పెరుగుదలతో వ్యవసాయ రంగం, రవాణా రంగం కుదేలైందని, ఇప్పటికైనా ధరలు నియంత్రిం చాలని కోరారు. తాడిశెట్టి వెంకట రమణ, కె.రఘు, సువర్ణరాజు, మాజీ ఎంపీ టీసీ దాలి నాయుడు, ఎస్‌.దుర్గాప్రసాద్‌, కె.ఆదిశేషు, ఘంటా దుర్గారావు, మిల్కి యార్‌ తదితరులు పాల్గొన్నారు.

పెదపాడు : దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు రేట్లను తగ్గించాయని, వైసీపీ ప్రభుత్వం మాత్రం రేట్లు తగ్గించకుండా కుంటి సాకులు చెబుతూ ప్రజలను మోసగిస్తోందని టీడీపీ మండల అధ్యక్షుడు లావేటి శ్రీనివాసరావు తెలిపారు. పెదపాడులోని పెట్రోలు బంక్‌ల వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బంక్‌ల వద్ద కొద్దిసేపు హారన్‌లు మోగించి నిరసన తెలిపారు. అనంతరం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొప్పన బాబ్జి, వేమూరి శ్రీనివాస రావు, వడ్డే వాసవి, రంభా నాగరాజు, కరుకోటి మోహనరావు, నవీన్‌, రావాడ గాంధీ, ఆంజనేయులు పాల్గొన్నారు.  

పెదవేగి : ఇంధన ధరలు తగ్గించి, ప్రజలపై భారాన్ని తగ్గించాలని కోరుతూ టీడీపీ శ్రేణులు పెదవేగి, విజయరాయి గ్రామాల్లో పెట్రోల్‌ బంకుల దగ్గర మంగళవారం ఆందోళన చేశాయి. టీడీపీ మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యుడిపై పెనుభారాన్ని మోపిందన్నారు. ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఇంధన ధరలను తగ్గిస్తే మనరాష్ట్రంలో పెట్రోధరల్లో తగ్గింపు లేదన్నారు.  ప్రభుత్వం తక్షణం ధరలను తగ్గించాలన్నారు. సర్పంచ్‌లు తాతా శ్రీరామూర్తి, మేకా కనకరాజు, టీడీపీ నాయకులు తాతా సత్యనారాయణ, కంచెన మోహనరావు, తలకొండ జమలయ్య, భాస్కరరావు, చీమకుర్తి నాగబాబు, సుగసాని గంగాధరరావు, మంచినేని శ్రీనివాసరావు, రామానుజం వెంకటేశ్వరరావు, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు. విజయరాయిలో టీడీపీ నాయకులు పెట్రోల్‌ బంక్‌ దగ్గర ధరలు తగ్గించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. టీడీపీ నాయకులు దారిబోయిన సత్యనారాయణ, రావిపాటి పిచ్చియ్య, బిర్లంగి పెద్దులు, ఈడ్పుగంటి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-11-10T05:18:50+05:30 IST