ప్రశ్నిస్తే దాడులా?
ABN , First Publish Date - 2021-10-21T04:38:30+05:30 IST
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు బుధవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది.

భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
బంద్‌కు అడుగడుగునా పోలీసుల ఇబ్బందులు
ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్‌లు
స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత
ఏలూరు ఫైర్‌స్టేషన్, అక్టోబరు 20 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు బుధవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది. వైసీపీ అరాచక పాలన సాగిస్తోందంటూ గళమెత్తారు. బంద్‌కు ప్రజల నుంచి సహకారం లభించినప్పటికీ పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించారు. టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. రోడ్లపైకి వచ్చిన కార్య కర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూత పడ్డాయి.
వైసీపీ అరాచక శక్తులు టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని, నాయకులు ఇళ్లపై దాడులు చేసి ధ్వంసం చేసినందుకు నిర సనగా టీడీపీ శ్రేణులు తలపెట్టిన బంద్‌కు ప్రజల నుంచి సహకారం లభిం చినప్పటికీ పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే టీడీపీ నాయకుల ఇళ్లను పోలీసులు మోహరించారు. ప్రధాన నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. నగరమంతా పోలీసులతో మోహరించా రు. బుధవారం బంద్‌లో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలకు అడుగడుగునా పోలీ సులు ఇబ్బందులు సృష్టించారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు వన్‌టౌన్, టూ టౌన్ ఏరియాల్లో నాలుగు బృందాలుగా ఏర్పడి బంద్ నిర్వహించారు. వన్‌టౌన్ లో వస్త్రదుకాణాలు, బంగారు దుకాణాలను, హోల్‌సేల్ దుకాణాలను మూసివేసి బంద్‌కు సహకరించారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు కొన్ని స్వచ్ఛందంగా మూసివేశారు. తెరచి ఉన్న పాఠశాలలను టీడీపీ శ్రేణులు మూసి వేయించారు. వన్‌టౌన్, టూటౌన్ ఏరియాల్లో బంద్ చేస్తున్న టీడీపీ శ్రేణులను అడ్డగించి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
బడేటి చంటి, పాలి ప్రసాద్ హౌస్ అరెస్ట్
టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, టీడీపీ జిల్లా కార్యా లయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌లను మంగళవారం అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో వాక్ స్వాతం త్రాన్ని అణిచివేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటన్నారు. ఈ అరాచకాలకు నిరసనగా బంద్‌ను ప్రకటిస్తే అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా పోలీసులను ఇళ్లపైకి పంపి గృహ నిర్బంధాలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాక్షస పాలన, రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు వైసీపీకి దగ్గర పడ్డాయన్నారు. బంద్‌లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ని ర్బంధించారు. బంద్‌లో టీడీపీ కార్పొరేటర్లు, బంద్‌లో మాజీ కార్పొరేటర్లు మారం హనుమంతరావు, గూడ వల్లి వాసు, దాకారపు రాజే శ్వరరావు, పెద్దిబోయిన శివ ప్రసాద్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రశ్నించే ప్రతిపక్షంపై దాడులా..
దెందులూరు, అక్టోబరు 20 : వైసీపీ అసమర్థ పాలనతో అన్ని రంగాల్లో రాష్టాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు, కార్యాల యాలపై దాడులు చేయించడం మంచి పద్ధతి కాదని మండల టీడీపీ అధ్యక్షు డు మాగంటి నారాయణప్రసాద్ (మిల్లుబాబు) అన్నారు. తెదేపా రాష్ట్ర కార్యాల యంపై వైసీపీ కార్యకర్తల దాడికి నిరసన రాష్ట్రపార్టీ పిలుపు మేరకు బుధవారం ఏలూరు పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వలి అడ్డరోడ్డు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వాహనాలు భారీగా నిలిచి పోవడంతో పోలీసులు మహేష్ యాదవ్, మాగంటి నారాయణ ప్రసాద్, కోటక ల గణేష్, పప్పల రవిలను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. మాజీ వైస్ ఎంపీపీ మోతుకూరి నాని, కసుకూర్తి రామకృష్ణ, దెందులూరు సర్పంచ్ తోట ఏసమ్మ, ఎంపీటీసీ పెను బోయిన శేషారత్నం, గ్రామ టీడీపీ అధ్యక్షుడు యిప్పిలి వెంకటేశ్వరావు, గారపాటి కొండయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
పెదపాడులో బంద్ ప్రశాంతం
పెదపాడు, అక్టోబరు 20 : తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై వైసీసీ శ్రేణుల దాడిని నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు చేపట్టిన బంద్ మండలంలో బుధవారం ప్రశాంతంగా ముగిసింది. అప్పనవీడు, పెదపాడు గ్రామాలతో పాటుగా పలుచోట్ల టీడీపీ నాయకులు దుకాణాలు, బ్యాంకులను మూయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోం దని, దీనికి త్వరలోనే చరమగీతం పాడే రోజులు రానున్నాయని పలువురు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి గుత్తా అనిల్, ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు వడ్డి వాసవిదేవి, టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు, మట్టా శ్రీనివాస రావు, పావులూరి రామారావు, పావులూరి వంశీకృష్ణ, బెక్కం శ్రీనివాసరావు, కె.రాజు, దుడ్డు జయరామ్, ఎం.రవి, గుడిపూడి జయరాజు, నెర్సు నరసింహా, యాళ్ళ సత్యనారాయణ, రామాల జోజి తదితరులు పాల్గొన్నారు.
పెదవేగి మండలంలో అంతా బంద్
పెదవేగి, అక్టోబరు 20 : రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడ్డ వైసీపీ కార్యకర్తలపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు పెదవేగి మండలంలో పలు గ్రామాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూయించి, బంద్ చేశారు. పెదవేగి తహసీల్దారు కార్యాలయాన్ని మూయించి, తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. విజయరాయిలో దుకాణాలు, బ్యాంకులు మూయించి, నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ధర్నాలు చేస్తారనే సమాచారంతో పోలీసులు పలు గ్రామాల్లో టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. టీడీపీ పెదవేగి మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్‌ను అరెస్టు చేసి, ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే పలువురు నాయకులను పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివాహ కార్యక్రమానికి వెళ్తున్న బాపిరాజుగూడేనికి చెందిన టీడీపీ నాయకులను పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. ఈ సమయంలో చక్కెరవ్యాధితో బాధపడుతున్న పెద్దవయస్సు వ్యక్తి సమయానికి ఆహారం లేక నీరసించి, పడిపోయాడు. సహచరులు మంచినీరు పట్టించి సేదదీర్చారు.
అధికార దర్పంతో విచక్షణ మరిచారు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం
పెదవేగి, అక్టోబరు 20 : ‘అధికార దర్పంతో కొంతమంది పెద్దలు విచక్షణ మరిచి మాట్లాడుతున్నారు. వారంతా వాపును చూసి బలుపు అనుకుంటున్నారు’.. అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదవేగి మం డలం జగన్నాథపురం తోటలో ఉన్న ప్రభాకర్‌ను టీడీపీ నిరసనలో పాల్గొనకుండా పోలీసు లు బుధవారం నిర్బంధించారు. ఈ సందర్భంగా చింతమనేని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు తీరు, పోలీసుల చర్యలపై ధ్వజమెత్తారు. మీ పరిపాలన రామరాజ్యం అయితే ప్రజలు తిరిగి మి మ్మల్నే గెలిపిస్తారు. ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. దైవ దర్శనానికి వెళ్ళి వస్తున్న నన్ను అక్రమంగా అరెస్టు చేసి, గంజాయి కేసు పెట్టాలని చూ శారని, కానీ అంతా బట్టబయలు కావడంతో కుదరలేదని, ఇందులో ప్రత్య క్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిపైనా కేసు వేస్తానన్నారు. ప్రభాకర్‌ను తోటలో నిర్బంధించిన సమయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా తొలుత ఉదయం దుగ్గిరాలలోని ఆ యన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్టుకు ప్రయత్నించగా కార్యకర్తలు రక్షణగా నిలవడంతో చింతమనేని అక్కడ నుంచి జగన్నాథపురం తోటకు వచ్చారు. అక్కడకూ పోలీసులు చేరుకుని ఎటూ వెళ్లకుండా నిర్బంధించారు.