ప్రమాదకరంగా తమ్మిలేరు వంతెన
ABN , First Publish Date - 2021-12-26T05:40:15+05:30 IST
ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా వీవీ నగర్ వెళ్లే రహదారిలో గల తమ్మిలేరు వంతెనకు పడమరవైపున గల రెయిలింగ్స్‌ను తొలగించి నాలుగేళ్లు అయినా తిరిగి పునరుద్ధరిం చకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు కార్పొరేషన్ :
ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా వీవీ నగర్ వెళ్లే రహదారిలో గల తమ్మిలేరు వంతెనకు పడమరవైపున గల రెయిలింగ్స్‌ను తొలగించి నాలుగేళ్లు అయినా తిరిగి పునరుద్ధరిం చకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం వరదలు వచ్చి న నేపథ్యంలో నగరంలోకి వరద రాకుండా ఎస్‌ఎంఆర్ నగర్ మీదుగా వరదను తరలించేం దుకు అప్పటి అధికారులు ఎక్స్‌కవేటర్ల సాయంతో రెయిలింగ్స్‌ను తొలగించారు. ఇప్పటికి నాలుగేళ్లు గడిచినా రెయిలింగ్స్‌ను తిరిగి ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వంతెనపై రక్షణ గోడలు నిర్మిం చాలని లేదా రెయిలింగ్స్‌ను ఏర్పాటు చేయాలని వాహనదారులు, నగరవాసులు కోరుతున్నారు.