అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-06T04:55:43+05:30 IST
జాతీయ రహదారి పక్కన నిర్మానుష్య ప్రదేశంలో ఒక గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

ఏలూరు క్రైం, మే 5: జాతీయ రహదారి పక్కన నిర్మానుష్య ప్రదేశంలో ఒక గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏలూరు సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారి మెయిన్ బైపాస్ రత్నాస్ హోటల్ సమీపంలోని నిర్మానుష్య ప్రదే శంలో గుర్తుతెలియని ఒక వ్యక్తి మృత దేహం ఉన్నట్టు ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం అందింది. రూరల్ ఎస్‌ఐ చావా సురేష్ సిబ్బందితో బుధవారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సుమారు 30 ఏళ్ల వయస్సు కలిగిన ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. మృతుడి ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి. అతని జేబులో సైకిల్ తాళపు చెవి, ఖైనీ, గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి.అతని పక్కనే తాగేసి ఉన్న మద్యం బాటిల్, రెండు వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో రాత్రి వేళ వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు ఆనవాళ్ళు లభించాయి. అతను ఎలా మరణించాడనే దానిపై నిర్ధారించే నిమి త్తం అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రూరల్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 08812– 230653గాని ఎస్‌ఐ సెల్ నెంబర్ 94407 96636నకు సమాచారం అం దించాలని కోరారు.