భార్య మందలించిందని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-22T05:21:17+05:30 IST

రైలుపట్టాలపై మృతి చెందిన వ్యక్తిని బంధువులు గుర్తించారు.

భార్య మందలించిందని ఆత్మహత్య

ఏలూరు క్రైం, ఆగస్టు 21: రైలుపట్టాలపై మృతి చెందిన వ్యక్తిని బంధువులు గుర్తించారు. ఏలూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గన్నవరం రైల్వే స్టేషన్‌ సమీపం లో రైల్వే పట్టాలపై ఈనెల 20వ తేదీన ఒక వ్యక్తి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న ఏలూ రు రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దినపత్రికల్లో వచ్చిన ఫొటో ఆధారంగా బంధువులు గుర్తించారు. ఏలూ రు సమీపంలోని దెందులూరు మండలం సోమవరప్పాడునకు చెందిన చిన్నం భాస్కరరావు (56) గన్నవరం వెళ్లాడు. అతను అధికంగా మద్యం తాగే అల వాటు ఉంది. ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉంటాడు. అతని భార్యతో గొడవపడి గతంలోనూ రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బంధువులు వెతికి తీసుకొచ్చారు. వరలక్ష్మీ వ్రతం చేస్తున్న రోజు కూడా తాగి వచ్చావంటూ భార్య మందలించడంతో బయటకు వెళ్లిపోయిన భాస్కరరావు గన్నవరం వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే ఎస్‌ఐ శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.  

Updated Date - 2021-08-22T05:21:17+05:30 IST