నగరంలో సూపర్ శానిటేషన్
ABN , First Publish Date - 2021-05-06T05:00:10+05:30 IST
కరోనా విజృంభిస్తున్న వేళ నగరా న్ని పరిశుభ్రంగా ఉంచేందుకు యంత్రాంగం నడుం బిగించింది.

ఏలూరు ఫైర్‌స్టేషన్, మే 5 : కరోనా విజృంభిస్తున్న వేళ నగరా న్ని పరిశుభ్రంగా ఉంచేందుకు యంత్రాంగం నడుం బిగించింది. దీనిలో భాగంగా గత ఏప్రిల్ నెల నుంచి నగరంలో సూపర్ శాని టేషన్ పనులు చేపట్టారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ వంద రోజుల కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి నగరంలో పారిశుధ్య కార్మికులు తమ పనులను ప్రారంభిస్తున్నారు. పనులను నగర కమిషనర్ డి.చంద్రశేఖర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు పది డివిజన్లను ఎంచుకుని పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం 45, 43 డివిజన్‌లో సూపర్ శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. ప్రత్యేక డ్రోన్ యంత్రం సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వీధుల్లో ఇళ్ల పైన స్ర్పే చేశారు. డ్రైయిన్లలో మురుగును శుభ్రం చేసి సాఫీగా మురు గునీరు పారుదల అయ్యే విధంగా పూడికలు తీశారు. అనంతరం డ్రెయిన్లలో దోమలు ప్రబలకుండా స్ర్పే చల్లారు. రోడ్లపై చెత్తను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. ప్రతి రోజు సూపర్‌శానిటేషన్ పనులు జరుగు తాయని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్త ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అప్పగించాలన్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో 12 గంటలు దాటిన తరువాత ఎవరు బయటకు రావద్దని సూచించారు. కమిషనర్ వెంట సీనియర్ సూపర్ వైజర్ కొండలరావు, పారిశుధ్య కార్మికులు ఉన్నారు.