భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-27T05:13:27+05:30 IST
భర్త వేధింపులు భరించ లేక ఒక వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఏలూరుక్రైం, నవంబరు 26 : భర్త వేధింపులు భరించ లేక ఒక వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు గన్‌బజార్‌కు చెందిన దుడ్డు రాధిక (25)కు 2014 ఫిబ్రవరి 8న అనిల్‌కుమార్‌తో వివాహ మైంది. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఏలూరు నగర పాలక సంస్థలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నా డు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నా యి. భార్యపై అనుమానంతో అతను రోజూ మద్యం తాగి వచ్చి ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ వేధింపులను భరించలేక రాధిక గురు వారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచా రం శుక్రవారం తెల్లవారుజామున టూటౌన్ పోలీసులకు అందడంతో సీఐ ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కిషోర్‌బాబు సిబ్బం దితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. భార్య మరణానికి కారణమైన అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.