ఫిర్యాదుతో వచ్చి పెట్రోల్‌ పోసుకున్నాడు..

ABN , First Publish Date - 2021-02-02T05:22:21+05:30 IST

తనకు న్యాయం చేయాలంటూ డీఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక యు వకుడు తనపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

ఫిర్యాదుతో వచ్చి పెట్రోల్‌ పోసుకున్నాడు..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు

డీఐజీ కార్యాలయంలో యువకుడి  ఆత్మహత్యాయత్నం .. కేసు నమోదు

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 1: తనకు న్యాయం చేయాలంటూ డీఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక యు వకుడు తనపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నరసాపురానికి చెందిన ముప్పిడి మణికంఠ స్వామిరెడ్డి (27) అదే ప్రాంతానికి చెందిన ఒక మహి ళ వద్ద అవసరం నిమిత్తం డబ్బులు తీసుకున్నాడు. ఆ సొమ్ములు చెల్లించకుండా పైగా ఆమెను లైంగికంగా వేధించడంతో బాధితురాలు నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించారు. అయితే ఆమెకు ఇవ్వాల్సిన సొమ్ము ఫిబ్రవరి 1వ తేదీన చెల్లిస్తానని పెద్దల ద్వారా అంగీకరించాడు. ఈక్రమంలో సోమవారం సొమ్ము చెల్లించకుండా నేరుగా ఏలూరు డీఐజీ కార్యాలయానికి వచ్చి పోలీసులు తనను వేధిస్తున్నారంటూ తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదును రాసుకుని తీసుకొచ్చాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం తనతో పాటు ఐదు లీటర్ల పెట్రోలు తెచ్చుకుని చెట్టు కింద పెట్టుకుని తనపై పోసే సుకున్నాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా డీఐజీ కార్యాలయానికి వచ్చి తనపై పెట్రోలు పోసుకుని భయ భ్రాంతులకు గురి చేసిన మణికంఠస్వామిరెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ డీఐజీ కార్యా లయం మేనేజర్‌ జీవీ నాగరాజు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఇన్‌ఛార్జి సీఐ బోణం ఆది ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు ఎంవీ రమణ, ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-02T05:22:21+05:30 IST