క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2021-12-19T06:15:21+05:30 IST

క్రీడల వల్ల మానసికోల్లాసం, ఉత్సాహం పెరుగు తుందని దీనివల్ల విధి నిర్వహణలో సమర్థవంతంగా నిర్వర్తించగలరని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సూచించారు.

క్రీడలతో మానసికోల్లాసం
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ.. ముగిసిన పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌

 ఏలూరు క్రైం, డిసెంబరు 18 : క్రీడల వల్ల మానసికోల్లాసం, ఉత్సాహం పెరుగు తుందని దీనివల్ల విధి నిర్వహణలో సమర్థవంతంగా నిర్వర్తించగలరని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సూచించారు. జిల్లా వార్షిక పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ శనివారం రాత్రి ముగిసింది. ముగింపు ఉత్సవాలు సందర్భంగా ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ఎస్పీ మాట్లాడారు. ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేస్తున్న సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండే ఉద్దేశ్యంతో స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహించామన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడా కారులను రేంజ్‌ పరిధిలో నిర్వహించే డ్యూటీమీట్‌కు, స్టేట్‌ పరిధిలో నిర్వహించే డ్యూటీ మీట్‌కు పంపిస్తామన్నారు. విజేతలకు బహుమతులను అందించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏఎస్పీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ ఎస్పీ జయరామరాజు, ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T06:15:21+05:30 IST