పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం : ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-22T04:29:51+05:30 IST

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ఎంతో ప్రాధా న్యత ఇస్తున్నామని ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు.

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం : ఎస్పీ
అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న పోలీసులు

ఏలూరు క్రైం, అక్టోబరు 21 : పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ఎంతో ప్రాధా న్యత ఇస్తున్నామని ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పుర స్కరించుకు పోలీసు అమర వీరుల స్మృతివనం వద్ద ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ మాట్లాడారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు పాల్గొన్నారు. పోలీస్‌ శాఖలో పనిచేస్తూ కరోనా కాలంలో వైరస్‌ బారినపడి మరణించిన పోలీస్‌ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.పది వేలు చొప్పున చెక్కులను మంత్రి నాని, ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అందించారు. మరణించిన  హోంగార్డు సిబ్బంది కుటుంబ సభ్యులకు పది లక్షల 40 వేల రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారందరి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.  

Updated Date - 2021-10-22T04:29:51+05:30 IST