ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ పోటీలు
ABN , First Publish Date - 2021-10-26T05:13:31+05:30 IST
రోలర్ స్కేటింగ్‌్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

ఏలూరు స్పోర్ట్స్, అక్టోబరు 25 : రోలర్ స్కేటింగ్‌్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. సెట్వెల్ సీఈవో ఎండీ మెహర్రాజ్ పోటీలను ప్రా రంభించి మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక మానసిక వికాసంతో పాటు విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. అసోసియేషన్ జిల్లా కార్య దర్శి కానాల రమేష్ మాట్లాడుతూ ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా వంద మందికి పైగా హాజరయ్యారని ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల లోపు బాలబాలికలకు పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. మంగళ వారం రోడ్డు స్కేటింగ్ పోటీలు నిర్వహి స్తామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు నవంబరు 11 నుంచి 15వ తేదీ వరకు భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. డీఎస్‌ఏ చీఫ్‌కోచ్ ఎస్‌ఏ అజీజ్, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డి.సురేష్, తదితరులు పాల్గొన్నారు.