సందడిగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-25T05:38:46+05:30 IST

సెమీ క్రిస్మస్‌ వేడుకలు శుక్రవారం నగరం లోని పలు విద్యా సంస్థల్లో జరిగాయి.

సందడిగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు
శశి విద్యా సంస్థల్లో బాలల సందడి

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 24: సెమీ క్రిస్మస్‌ వేడుకలు శుక్రవారం నగరం లోని పలు విద్యా సంస్థల్లో జరిగాయి. ప్రేమ, స్నేహ భావానికి క్రిస్మస్‌ చిహ్నమని పాస్టర్లు, వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపి కేక్‌ను కట్‌ చేసి పంపిణీ చేశారు. ఆర్‌ఆర్‌పేట శర్వాణి హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. హెచ్‌ఎం సత్య శారద, డైరెక్టర్‌ మదన మోహనరాజు పాల్గొన్నా రు. ఏలూరు శశి విద్యా సంస్థల్లో నిర్వహించిన కార్యక్రమంలో బాలఏసుకు ప్రత్యేక కుటీరాన్ని నిర్మించి క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేశారు. చిన్నారులు ఏంజల్స్‌, శాంతాక్లాజ్‌ దుస్తుల్లో  అలరించారు. ఏసు జన్మ వృత్తాంతాన్ని బాల బాలికలు ఆటల రూపంలో ప్రదర్శించారు. శశి విద్యా సంస్థల ప్రతినిధి కె.ఎస్‌.ఎస్‌.మాధవ్‌ పాల్గొన్నారు.

 ఏలూరు తహసీల్దారు కార్యాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసి యేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌కుమార్‌, తహసీల్దార్‌ బి.సోమ శేఖరరావు క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేశారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఏలూరు టూటౌన్‌ : నారాయణ పాఠశాలలో శుక్రవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రత్యేక గీతాలు ఆలపించారు. క్రిస్మస్‌ తాత, దేవ దూతల వేషధారణలతో చిన్నారులు అలరించారు.   పాఠ శాల ప్రధానోపాధ్యాయులు రమేష్‌, ఏజీఎం రామిరెడ్డి, ఆర్‌ఐఏ శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.రత్నకుమారి విద్యార్థులు పాల్గొన్నారు.

పెదవేగి : పెదవేగిలోని ఎస్‌ఎంసీ హైస్కూల్‌లో సెమీ క్రిస్మస్‌ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. కరస్పాండెంట్‌ సీహెచ్‌.అవినాష్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు నాటికలు, నృత్యాలు, పాట లు ప్రదర్శించారు. వేడుకల్లో పాల్గొన్న దుగ్గిరాల సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య కళాశాల కరస్పాండెంట్‌ ఫాదర్‌ జి.మోజెస్‌ మాట్లాడుతూ క్రీస్తు సూచించిన మార్గంలో పయనించాలన్నారు. తొలుత కేక్‌ కట్‌ చేశారు. లయన్స్‌ క్లబ్‌ చైర్మన్‌ సీహెచ్‌. కృష్ణంరాజు, సభ్యుడు డి.వర్మ, హెచ్‌ఎం ఉషారాణి, పావని, గోపాలకృష్ణ, ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

దెందులూరు : ఏలూరు ఆర్‌సీఎం పీఠం పరిధిలోని కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజలందరూ శాంతి, సుఖ సంతోషాలతో క్రీస్తు ప్రేమలో జీవించాలని పోతునూరు ఆర్‌సీఎం చర్చి ఫాదర్‌ (సాహు యూత్‌ కమీషన్‌ డైరెక్టర్‌) డేవిడ్‌రాజు అన్నారు. సాహు మేత్రాసన యువత విభాగం, సంఘ స్తుల సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహిం చారు. డేవిడ్‌రాజు  క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి అందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాహు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భూషణ్‌, యూత్‌ సభ్యులు రత్నవర్మ, దివ్య, రవికిరణ్‌, రాజేష్‌,నాగేంద్ర,కాసు, సంఘస్తు లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-25T05:38:46+05:30 IST