రిజర్వేషన్లతో ఆశలు గల్లంతు
ABN , First Publish Date - 2021-02-07T05:15:20+05:30 IST
మండలంలోని పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లతో ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు ఆవిరయ్యాయి.

తమ స్థానంలో సతీమణులను బరిలోకి దించే యత్నాలు
గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం
నేతల వద్దకు ఆశావహుల క్యూ
ఏలూరు రూరల్, ఫిబ్రవరి 6: మండలంలోని పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లతో ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు ఆవిరయ్యాయి. ఏలూరు మండలంలో 15 గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్లు గతం లో బీసీలకు పెద్ద పీట వేయగా మారిన రిజర్వేషన్ల కారణంగా మండ లంలో కేవలం రెండు చోట్ల మాత్రమే బీసీ మహిళలకు కేటాయించారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏలూరు మండలంలో అత్యధి కంగా బీసీలకు ఏడు స్థానాలకు పైగా బీసీలకు కేటాయించారు. తాజాగా ప్రక టించిన రిజర్వేషన్లలో షెడ్యూల్ కులాలకు సంబంధించి మహిళలకు రెండు సీట్లు, అన్‌రిజర్వుడ్ మహిళలకు నాలుగు, అన్ రిజర్వుడ్ నాలుగు, షెడ్యూల్ కులాలకు సంబంధించి మరో రెండు సీట్లు కేటాయించారు. దీంతో మండ లం లో మహిళలకే అత్యధిక సీట్లు కేటాయించినట్లైంది. అయితే రిజర్వేషన్లు తారు మారు కావడంతో పోటీ చేద్దామనుకున్న ఆశావహులు ఖంగు తిన్నారు. ఇప్పు డు ఆయా పార్టీల తరపున నాయకుల సతీమణులను రంగంలోకి దింపుతు న్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీ ఎన్నికల్లో సీటు దక్కించుకుని గెలు పొం దాలన్న కోరికతో ఎన్నికల షె డ్యూల్ ప్రకటించిన నాటినుంచి కొందరు గ్రామ స్థాయిలో పట్టు ఉన్న ప్రజా ప్రతినిధులను వెం టబెట్టుకుని తిరిగారు. రిజర్వేష న్లతో వారి ఆశలు సన్నగిల్లా యి. ఈనెల 10న నాల్గొవ విడ త ఎన్నికల నోటిఫికేషన్ విడు దల కానుంది. ఎన్నికల నిర్వహ ణకు యంత్రాంగం సిద్ధమవు తోంది. ఇటీవల రిజర్వేషన్ ప్రక్రియ వెలువడడం మండలంలో రాజకీయం ఒక్క సారిగా వేడిక్కెంది. దీంతో ఆశావహుల్లో పోటీ మొదలైంది. టిక్కెట్లు దక్కిం చుకుని వైసీపీ, టీడీపీ అనుకూల అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు అయా పార్టీల కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. ఆయా పార్టీల నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు అభ్యర్థుల వేట కోసం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఎవరికి సీటు ఇస్తే ఎలా ఉంటుందనే కోణంలో పరిశీలన చేస్తున్నారు.