ఆర్టీసీ సాయం అందజేత

ABN , First Publish Date - 2021-12-19T06:29:11+05:30 IST

జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు రెండున్నర లక్షల రూపాయల చొప్పున చెక్కులను అంద జేశారు.

ఆర్టీసీ సాయం అందజేత
బాధిత కుటుంబాలకు చెక్కులందిస్తున్న ఆర్టీసీ అధికారులు

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 18 : జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు రెండున్నర లక్షల రూపాయల చొప్పున చెక్కులను అంద జేశారు. ఈ నెల 15వ తేదీ జల్లేరు వాగులో పల్లె వెలుగు బస్సు పడి డ్రైవర్‌ సహా పదిమంది చనిపోయారు. తొమ్మి ది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు, కేంద్రం రెండు లక్షలు, ఆర్టీసీ రెండున్నర లక్షల చొప్పున మొత్తం తొమ్మిదిన్నర లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించాయి. ముందుగా ఆర్టీసీ రెండున్నర లక్షల చొప్పు న చెక్కులను శనివారం ఆరు గురికి అందజేశారు. మిగి లిన ముగ్గురికి త్వరలోనే అందజేస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం వీరయ్యచౌదరి తెలిపారు. డ్రైవర్‌కు సంస్థ అందించే బెనిఫిట్స్‌ అందిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-12-19T06:29:11+05:30 IST