విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలి
ABN , First Publish Date - 2021-03-25T05:24:49+05:30 IST
ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరుతూ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు డీపో వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు.

ఏలూరు రూరల్, మార్చి 24 : ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరుతూ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు డీపో వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. శిబిరాన్ని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుందరయ్య ప్రారంభించి మాట్లాడారు. విశాఖ స్టీలు ప్లాంటు నష్టాలకు కేంద్ర ప్రభుత్వ విధానమే కారణమన్నారు. 26న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో జీవీ శాస్త్రి, టీకే రావు, ఎం.అరుణకుమారి, టీఎస్ కళ, ఎండీ హుస్సేన్, ఎం.సురేష్, శ్రీనివాస్, వీపీ రావు, కేవీవీజేవీ చారి, పీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.
––––––––––––––––––––––––––