రోడ్డెక్కితే నరకమే..!

ABN , First Publish Date - 2021-01-21T04:33:56+05:30 IST

వాహనదారులు రోడ్డెక్కాలంటేనే జంకుతు న్నారు. దూరపు ప్రయాణాలంటే అమ్మో అంటూ వణికిపోతున్నారు.

రోడ్డెక్కితే నరకమే..!
జాలిపూడి రోడ్డు దుస్థితి

 అధ్వానంగా రహదారులు

కంకర తేలి గుంతలమయం

ప్యాచ్‌వర్కులే గతి.. పట్టించుకోని అధికారులు 

ఏడాదిగా ఇదే పరిస్థితి.. వాహనదారుల ఆవేదన 


ఏలూరు రూరల్‌, జనవరి 20 : వాహనదారులు రోడ్డెక్కాలంటేనే జంకుతు న్నారు. దూరపు ప్రయాణాలంటే అమ్మో అంటూ వణికిపోతున్నారు. ఎందు కంటే గోతులతో భయంకరంగా మారిన రోడ్లే కారణం. గుంతల రోడ్డులో పట్టు మని నాలుగు కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికే అలసిపోతున్నారు. ఓ పది కిలో మీటర్లు వెళ్లిరావాలంటే విసిగిపోతున్నారు. ఇది ఏలూరు మండలంలోని రోడ్ల దుస్థితి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కాదు. జిల్లా కేంద్రంలో కూడా గుంతల రోడ్లే దిక్కు. మండలంలోని మాదేపల్లి, జాలిపూడి, లింగారావు గూడెం, శ్రీపర్రు, కలకుర్రు వరకూ రోడ్లంతా గుంతలమయమే. ఏడాదిగా ప్రజలు రాకపోకలు సాగించడానికి నరకం అనుభవిస్తున్నారు. వర్షాలకు రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. వాటిని పట్టించుకునే నాథుడే కరువ య్యారు. దీంతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్లు మినహా మిగిలినవన్నీ కంకర తేలి గుంతల మయంగా కన్పిస్తున్నాయి. గ్రామా ల మధ్య ఉన్న రహదారుల కంటే మెయిన్‌రోడ్డు దారులే దారుణంగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగానే రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లు సైతం ఏడాదిలోపే దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్న రోడ్లన్నింటికీ నిధులు మంజూరు చేయలేని దుర్భర పరిస్థితి ఏడాది కాలంగా నిధుల కొరతతో ప్యాచ్‌వర్కులు మాత్రమే చేస్తున్నారు. ఇక కొత్త రోడ్లు ఎప్పు డు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. మండలంలోని వెంకటాపురం పంచాయతీ సుంకరవారితోట మొదలుకొని కలకుర్రు వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రమాదాలకు నిలయంగా రోడ్లు మారాయి. ఒకవైపు గోతులు మరోవైపు దుమ్ములో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్ల పొడవునా గుంతలు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.  ఇప్పటి కైనా అధికారులు స్పందించి కొత్త రోడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-01-21T04:33:56+05:30 IST