ఎంతకాలం ఇలా..!

ABN , First Publish Date - 2021-12-31T05:49:43+05:30 IST

నగరంలోని పలు డివిజన్లలో ప్రధాన రోడ్లకు లింకుగా ఉన్న రోడ్ల జాయింట్లలో డ్రెయినేజీలపై శ్లాబ్‌ మూతలు సక్రమంగా లేకపోవడం, కొన్నిచోట్ల శ్లాబ్‌ మూతలూ లేక పోవడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఎంతకాలం ఇలా..!
పాత శివాలయానికి వెళ్లే మలుపులో శ్లాబ్‌ ఇలా..

అస్తవ్యస్తంగా రోడ్డు జాయింట్లు

అధికారులు, పాలకుల తీరుపై విమర్శలు

తక్షణం సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్‌


ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 30 : నగరంలోని పలు డివిజన్లలో ప్రధాన రోడ్లకు లింకుగా ఉన్న రోడ్ల జాయింట్లలో డ్రెయినేజీలపై శ్లాబ్‌ మూతలు సక్రమంగా లేకపోవడం, కొన్నిచోట్ల శ్లాబ్‌ మూతలూ లేక పోవడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగు తున్నాయి. ఎంతకాలం ఇలా సమస్యలతో సతమత మవ్వా లంటూ ప్రశ్నిస్తున్నారు. కెనాల్‌ రోడ్డులోని కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లే రోడ్డు జాయింట్‌ లో శ్లాబ్‌ మూత లేకపోవడం, ఉన్నవి సక్ర మంగా లేకపోవడం రోడ్డు స్థాయిలో ఉండక పోవడం, రైతుబజార్‌ ముఖ ద్వారంలో రాక పోకలకు ఇబ్బంది కరంగా డ్రెయినేజీ శ్లాబ్‌ మూతలు ఉన్నాయి. కెనాల్‌ రోడ్డు నుంచి పాత శివాలయానికి వెళ్లే రోడ్డు జాయింట్లు కూడా మూతలు ఎగుడు దిగుడుగా ఉండడంతో రాకపోక లకు ఇబ్బందికరంగా పరిణమించాయి. రోడ్డు స్థాయిలోనే డ్రెయినేజీ మూత లు ఉండేలా, ఒకే స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవా లని వాహనదారు లు, నగరవాసులు కోరుతున్నారు.

ప్రజలు సహకరించాలి : డీఐజీ

ఏలూరుక్రైం, డిసెంబరు 30: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమైక్రాన్‌, కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.వి.మోహన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఏలూరు రేంజ్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు, రాజమండ్రి అర్బన్‌ పోలీస్‌ జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతీ ఒక్కరూ సంతోషంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లా లని ఆకాంక్షించారు. ఈనెల 31వ తేదీ సాయంత్రం నుంచి రేంజ్‌ పరిధిలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్‌లను ఏర్పాటు చేస్తున్నామని, రాత్రి గస్తీ ముమ్మరం చేస్తామన్నారు.

 యువకులు అర్ధరాత్రి వేళల్లో మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ చెప్పారు. జిల్లాలోని ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబు తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాత్రి సమయంలో బార్‌లలో మద్యం తాగించి వేడుకలు నిర్వహించడానికి అనుమతులు లేవని, హోటళ్ళల్లో పార్టీల కు అనుమతులులేవని, 31వ తేదీ రాత్రి పార్టీలు జరపరాదన్నారు. 

Updated Date - 2021-12-31T05:49:43+05:30 IST