అధికారుల తీరుపై ఆర్డీవో అసహనం

ABN , First Publish Date - 2021-02-02T05:07:45+05:30 IST

అధికారులు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కొవ్వూరు ఆర్డీవో కె.లక్ష్మారెడ్డి హెచ్చరించారు.

అధికారుల తీరుపై ఆర్డీవో అసహనం
దేవరపల్లిలో అధికారులతో సమీక్షిస్తున్న ఆర్డీవో లక్ష్మారెడ్డి

గోపాలపురం, ఫిబ్రవరి 1: అధికారులు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని కొవ్వూరు ఆర్డీవో కె.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్టేజ్‌వన్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అయితే ఆర్డీవో 10గంటలకే శిక్షణ కార్యక్రమానికి హాజరైనప్పటికి అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం మధ్యాహ్నం ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో ఆర్డీవో లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమావేశానికి హాజరైన తీరు చూస్తుంటే పని తీరు అర్థమవుతుందని అసహనం వ్యక్తం చేశారు. 

దేవరపల్లి:  ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి అన్నారు. దేవరపల్లిలో ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎన్నికల సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నామినేషన్‌ పత్రాలను సక్రమంగా పరిశీలించాలని, గుంపులుగా ఎవరిని అనుమతించరాదన్నారు. 


Updated Date - 2021-02-02T05:07:45+05:30 IST