ఇచ్చేయాల్సిందే!

ABN , First Publish Date - 2021-10-30T04:53:50+05:30 IST

బియ్యం గోనె సంచులను తిరిగి ఇచ్చేయాలని ప్రభు త్వం ఆదేశించడాన్ని డీలర్లు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు.

ఇచ్చేయాల్సిందే!

ఖాళీ బియ్యం గోనెసంచులపై స్పష్టత 

డీలర్ల ఆదాయానికి గండి

ప్రభుత్వ ఆదేశాలపై తీవ్ర వ్యతిరేకత


ఏలూరు రూరల్‌, అక్టోబరు 29 : బియ్యం గోనె సంచులను తిరిగి ఇచ్చేయాలని ప్రభు త్వం ఆదేశించడాన్ని డీలర్లు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కనీస ఆదాయం లేకపోతే తాము విధులు నిర్వహించలేమని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు రేషన్‌ సరుకులను అం దించడంలో డీలర్లు కీలకం. ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌తో గోనె సంచుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం డీలర్లకు ఆధారం. అయితే ఇప్పుడు ఖాళీ గోనె సంచుల ద్వారా వచ్చే ఆదాయానికి ప్రభుత్వం గండికొట్టేలా నిర్ణయం తీసుకుంది. వాటిని తిరిగి ప్రభుత్వానికి ఉచితంగా అప్పగించాలని చెప్పింది. దీనిని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి గోనెసంచికి రూ.20  రేషన్‌ దుకాణాల డీలర్ల ఖాతాలో జమ అయ్యేది. కొద్ది నెల లుగా ఆ పరిస్థితి లేదు. అయినా ఖాళీ గోనెసంచులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే నని చెప్పడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు మండలంలో 88 రేషన్‌ డిపో డీలర్లు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ఖాళీ గోనెసంచుల విక్రయం ద్వారా కొంత ఆదాయం సమకూరేది. కొత్త నిబంధనల ప్రకారం ఖాళీ గోనె సం చులు ప్రభుత్వానికి ఉచితంగా తిరిగి ఇచ్చేస్తే ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. మరోవైపు కందిపప్పు సరఫరాకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం ఇవ్వడం లేదు. డీలర్లు ప్రజలకు పంపిణీ చేశాక మిగిలిన కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేస్తున్నారు. కిలో రూ.65 చొప్పున డీలర్లు కందిపప్పు ఇస్తున్న ప్పటికీ లబ్ధిదారులు తీసుకోక మిగిలిపోతోంది. ఆ కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో డీలర్లు అలాగే చేస్తు న్నారు. ఆ మొత్తాన్ని కూడా ప్రభు త్వం చెల్లించడం లేదు. దీంతో ఆవేదనలో ఉన్న డీలర్లు ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


 గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలనడం దారుణం

రాజులపాటి గంగాధరరావు, రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు 

కొత్త నిబంధనలు తీసుకువచ్చి ఖాళీ గోనె సంచులను ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పడం దారుణం. ఈ నిబంధన రద్దు చేయాలి. అంగన్‌ వాడీ కేంద్రాలకు డీలర్లు అందించిన కందిపప్పుకు సంబంధించి బిల్లులు తక్ష ణమే చెల్లించాలి. 

Updated Date - 2021-10-30T04:53:50+05:30 IST