జోరువాన

ABN , First Publish Date - 2021-11-02T05:46:23+05:30 IST

పెదపాడుతో పాటుగా పలు గ్రామాల్లో జోరున వర్షం కురవడంతో గ్రామాలు తడిసిముద్దయ్యాయి.

జోరువాన
పెదపాడులో జోరువానలో ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు

పెదపాడు/ ఏలూరు రూరల్‌, నవంబరు 1: పెదపాడుతో పాటుగా పలు గ్రామాల్లో జోరున వర్షం కురవడంతో గ్రామాలు తడిసిముద్దయ్యాయి. వర్షపు నీటితో పాటుగా డ్రెయిన్లలోని మురుగునీరు సైతం రోడ్లపైకి వచ్చి చేరడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పాఠశాలలు విడిచి పెట్టే సమయంలో వర్షం పడటంతో విద్యార్థులు ఇళ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండటం, అమ్మకాలు మొదలయ్యే నాటికి వర్షాలు కురుస్తుండటంతో బాణసంచా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు  మండలంలోని పలు గ్రామాలతో పాటు ఏలూరు నగరంలో వర్షం కురిసింది. 

Updated Date - 2021-11-02T05:46:23+05:30 IST