విద్యార్థులకు బహుమతులు అందజేత

ABN , First Publish Date - 2021-11-01T05:15:14+05:30 IST

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కన బర్చిన విద్యార్థులకు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందించారు.

విద్యార్థులకు బహుమతులు అందజేత
బహుమతులు పొందిన విద్యార్థులతో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు క్రైం, అక్టోబరు 31 : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కన బర్చిన విద్యార్థులకు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ నగదు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందించారు. మొదటిస్థానం కుమారి ప్రతిభ, ద్వితీయ స్థానం పి.దుర్గాయువశంకర్‌, తృతీయస్థానం అమృత సాధించారు. ఈ ముగ్గురు సురేష్‌ చంద్రబహుగుణ ఇంగ్లీషుమీడియం స్కూలుకు చెందిన వారు. పోలీస్‌ సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రధమస్థానం ఆర్‌.యుగంధర్‌, ద్వితీయ స్థానం వెంకటేష్‌, తృతీయ స్థానం పి.శ్రీనివాసరావు పొందారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఏలూరు సురేష్‌చంద్రబహుగుణ ఇంగ్లీషుమీడియం స్కూలుకు చెందిన విద్యార్థి కె.సత్యప్రియ, ద్వితీయ స్థానం పెదపాడు జిల్లా పరిషత్‌ హైస్కూలుకు చెందిన నాగసత్య, తృతీయ స్థానం పాలకొల్లుకు చెందిన బిజి అభిరామ్‌లకు నగదు పురస్కారాలను ఎస్పీ అంద జేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సి.జయరామరాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ రామకృష్ణ, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-01T05:15:14+05:30 IST