ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-02T05:42:35+05:30 IST

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని సోమవారం ఏలూరు అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
అమరజీవికి నివాళులర్పిస్తున్న ఏలూరు అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు

ఏలూరు కల్చరల్‌, నవంబరు 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని సోమవారం ఏలూరు అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వసంతమహల్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అధ్యక్షుడు చెక్కా రాజారావు, మహిళా అధ్యక్షురాలు కూరళ్ళ రమాదేవి,  అంబికా రాజా, యువజన అధ్యక్షుడు మద్దుల పవన్‌కుమార్‌, ఎంటీవీ సత్య కు మార్‌, మోతే వెంకట చలపతిరావు, వేమా కోటేశ్వరరావు, గ్రంధి బదరి, ప్రవీణ్‌, శిరీష, అచ్యుత, జనార్దన్‌, ఎల్‌.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 

 వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు అంబికా రాజా మాట్లాడుతూ పొట్టి శ్రీరా ములు ప్రాణత్యాగం ఫలితంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని ఆ మహనీయుని స్ఫూర్తి కొనసాగాలన్నారు. యర్రా సోమలింగేశ్వరరావు, ఇన్‌చార్జి వేమా కోటేశ్వర రావు, మజ్జి కాంతారావు, ఎల్‌.వెంకటేశ్వరరావు, వేణుగోపాల్‌ లునాని, పి.కొండల రావు, ఎం.సూర్య నారాయణ, దువ్వి హేమసుందర్‌, కళాకారులు పాల్గొన్నారు. 

 ఏలూరు మండల పరిషత్‌ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో కిషోర్‌ కుమార్‌, మండల పరిషత్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

  ఏలూరు ఇరిగేషన్‌ డివిజన్‌ కార్యాలయంలో జిల్లా ఏపీ ఎన్జీవోస్‌ అసో సియేషన్‌ జిల్లా కార్యదర్శి చోటగిరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించా రు. ఏఎంసీ చైర్మన్‌ మంచెం మైబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహనీ యుల బాటలో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు. ఏఈ దేవ ప్రకాష్‌, డివిజన్‌ పర్యవేక్షకులు ఆర్‌. రవికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

పెదవేగి : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు పెదవేగిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చిన ఎంపీపీ తాతా రమ్య మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పరణతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన ఆశయాలకనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి యువత ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. తహసీల్దారు కార్యాల యంలో అమరజీవి చిత్రపటానికి తహసీల్దారు జి.సుందర్‌సింగ్‌, డీటీ ఎన్‌.జయశ్రీ నివాళులర్పించారు. పెదవేగి సర్పంచ్‌ తాతా శ్రీరామ్మూర్తి, సొసైటీ అధ్య క్షుడు పీవీ.సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనకళ్ళ వెంకటేశ్వరరా వు, కందుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-11-02T05:42:35+05:30 IST