పోణంగిలో అశ్లీల నృత్యాలు

ABN , First Publish Date - 2021-10-22T04:26:15+05:30 IST

ఏలూరు రూరల్‌ మండలం పోణంగిలో గురు వారం రాత్రి గొంతానమ్మ ఉత్సవంలో అశ్లీల నృత్యాలు యథేచ్ఛగా సాగాయి.

పోణంగిలో అశ్లీల నృత్యాలు

ఏలూరు క్రైం, అక్టోబరు 21 : ఏలూరు రూరల్‌ మండలం పోణంగిలో గురు వారం రాత్రి గొంతానమ్మ ఉత్సవంలో అశ్లీల నృత్యాలు యథేచ్ఛగా సాగాయి. గొంతానమ్మ నిమజ్జన ఊరేగింపులో ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌పై కొందరు మహి ళలు, హిజ్రాలు అశ్లీల నృత్యాలతో యువతను రెచ్చగొట్టారు. సమాచారం తెలి సిన రూరల్‌ సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్‌ఐ చావా సురేష్‌ గ్రామానికి వెళ్లడంతో నృత్యాలు చేసేవారు పారిపోయారు. పోలీసులు నిర్వాహకులను ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-22T04:26:15+05:30 IST