బాలిక కిడ్నాప్‌.. నలుగురిపై పోక్సో కేసు

ABN , First Publish Date - 2021-03-23T05:29:04+05:30 IST

ఒక పెళ్లిలో పరిచయం అయిన 14 ఏళ్ల బాలికకు ఒక యువకుడు మాయ మాటలు చెప్పి కిడ్నాప్‌ చేశాడు.

బాలిక కిడ్నాప్‌.. నలుగురిపై పోక్సో కేసు

ఏలూరు క్రైం, మార్చి 22: ఒక పెళ్లిలో పరిచయం అయిన 14 ఏళ్ల బాలికకు ఒక యువకుడు మాయ మాటలు చెప్పి కిడ్నాప్‌ చేశాడు.  అతనితో పాటు సహకరించిన మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదైంది. ఏలూరులోని  ఓ ప్రాంతానికి చెందిన బాలిక (14) 7వ తరగతి చదువు తోంది. ఆ బాలిక తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంటికి వివాహా నికి వెళ్లగా తాపీ పనులు చేసే తాడేపల్లిగూడెంనకు చెందిన పల్లి రాజు (19)   ప రిచయం అయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఈనెల 21వ తేదీ రాత్రి ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం తీసుకెళ్లిపోయాడు. బాలిక తండ్రి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ బోణం ఆదిప్రసాద్‌ ఆధ్వ ర్యంలో, ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌ బాబు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి బాలికను గుర్తించి తల్లి దండ్రు లకు అప్పగించారు. మరో వైపు రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-23T05:29:04+05:30 IST