యువతితో పాస్టర్‌ పరారీ

ABN , First Publish Date - 2021-05-19T04:31:05+05:30 IST

పాస్టర్‌ చిట్టిబాబు యువతికి మాయమాటలు చెప్పి సుమారు రూ.6లక్షలు నగదు, 20 కాసుల బంగారంతో యువతితో సహా మాయమయ్యాడు.

యువతితో పాస్టర్‌ పరారీ

పాలకొల్లు రూరల్‌, మే 18: లంకలకోడేరు శివారు ప్రాంతానికి చెందిన 20 సంవత్సరాల యువతి అనారోగ్యంతో ఉండడంతో తల్లి దండ్రులు చందపర్రుకు చెందిన  50 ఏళ్ళ నక్కా చిట్టిబాబు అనే పాస్టర్‌తో కొంతకాలంగా  ప్రార్థనలు చేయిస్తున్నారు. ఈనేపఽథ్యంలో పాస్టర్‌ చిట్టిబాబు యువతికి మాయమాటలు చెప్పి సుమారు రూ.6లక్షలు నగదు, 20 కాసుల బంగారంతో యువతితో సహా మాయమయ్యాడు. దీంతో తల్లి ఈనెల 11వ తేదీన రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్టా జిల్లా గన్నవరంలో నిందితుడు ఉన్నట్టు వచ్చిన సమాచారంతో పోలీసులు గన్నవరం వెళ్ళి అరెస్టు చేసి, యువతితో సహా పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు మంగళవారం తీసుకువచ్చినట్టు ఎస్‌ఐ అప్పారావు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.5.50లక్షలు నగదు, 20 కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారని తెలిపారు.


Updated Date - 2021-05-19T04:31:05+05:30 IST