అయ్యో.. అవ్వ
ABN , First Publish Date - 2021-03-25T05:29:17+05:30 IST
అసలే వేసవి కాలం. మండు టెండలు. రోడ్డు పక్కన ఎనిమిది పదులు నిండిన వృద్ధురాలు అల సటతో పడిపోయి ఉండగా అటు గా వెళ్తున్న వారు ఆమె పరిస్థితి గమనించి 108 కాల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చారు.

ఏలూరు క్రైం, మార్చి 24 : అసలే వేసవి కాలం. మండు టెండలు. రోడ్డు పక్కన ఎనిమిది పదులు నిండిన వృద్ధురాలు అల సటతో పడిపోయి ఉండగా అటు గా వెళ్తున్న వారు ఆమె పరిస్థితి గమనించి 108 కాల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బం ది అక్కడకు చేరుకుని ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పేరు కొడవలి రంగమ్మ (85) ఏలూరు పత్తేబాద అని చెప్తోంది. మరోసారి ఏలూరు తూర్పు వీధి అని చెప్తోంది. నలుగురు పిల్లలు ఉన్నా రని కొడుకులు తన వద్దకు రావడం లేదని తనను చూసేవారు ఎవరు లేరని ఒంటరి గానే జీవిస్తున్నానని చెబుతోంది. కొడుకుల వివరాలు చెప్పడానికి ఆమె నిరాకరి స్తోంది. ఈ సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ బోణం ఆది ప్రసాద్ బాధితు రాలికి ప్రాథమిక సహాయ సహకారాలు అందించారు. మరోవైపు విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఝాన్సీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఆమె వెంటనే స్పం దించి సిబ్బందిని పంపించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెను వృద్ధుల ఆశ్రమంలో ఉంచడానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.