ఏదీ ఆ..నాటి స్ఫూర్తి..?

ABN , First Publish Date - 2021-05-18T05:38:09+05:30 IST

గతేడాది కొవిడ్‌ సమయంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు పోటాపోటీగా సాయం అం దించారు.

ఏదీ ఆ..నాటి స్ఫూర్తి..?
ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్‌లో ఆహారం తింటున్న పోలీసు

కష్టకాలంలో ప్రజలకు అందని సాయం

నాడు పోటాపోటీగా.. సేవలు

నరసాపురం, మే 17: గతేడాది కొవిడ్‌ సమయంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు పోటాపోటీగా సాయం అం దించారు. కిరాణా, కూరగాయలు, కోడిగుడ్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం వంటి నిత్యావసరాలు అందిం చ డంలో పోటీపడ్డారు. రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఆర్థికస్తోమత కలిగిన వారు, వివిధ సంఘాలు ప్రజలకు కష్టకాలంలో ఆపన్నహస్తాలు ఆదుకున్నాయి. అప్పటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాకపోవడంతో సర్పంచ్‌, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేద్దామని ఆసక్తివున్న అభ్యర్థులు పోటాపోటీగా సాయం చేశారు. గతేడాది ఏప్రిల్‌, మే నెలల్లో పట్టణ, మండలాల్లో ఎక్కడ చూ సినా దాతల సేవా కార్యక్రమాలే కనిపించాయి. అప్పట్లో కొవిడ్‌ విజృంభణ పెద్దగా లేదు. కేవలం లాక్‌డౌన్‌ మాత్రం అమల్లో ఉండేది. పనులు లేక ఆర్థి కంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వీరి సాయం ప్రజలకు కొండంత అండగా నిలిచింది.


నేడు కనిపించని సాయం

నేడు ఈ సేవా స్ఫూర్తి చూద్దామన్నా మచ్చుకైనా కనిపించడం లేదు. రెండో విడత కొవిడ్‌ పట్టణ, మండలాల్లో విజృంభిస్తున్నది. మరోవైపు కర్ఫ్యూ అమల్లో ఉంది. దీంతో చాలామంది ఉపాధి లేక ఇంటి వద్దేనే ఉంటున్నారు. ఇటు వ్యవ సాయ పనులు లేకపోవడంతో కార్మికులకు ఉపాధి లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలామంది దాతల సాయం కోసం ఎదురుచూశారు. కానీ ఇంత వరకు అటువంటి సాయం ఎక్కడా కనిపించడం లేదు. కనీసం స్థానిక సంస్థల్లో గెలిచిన ఆభ్యర్థులు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక నేతలు చూద్దామన్న కనిపించని పరిస్థితి. ఏడాది కాలంలో కష్టం పెరిగినా.. సాయం చేసేందుకు ఎవరూ ముం దుకు రాకపోవడం ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది. నాటి సేవా స్ఫూర్తి ఏమైందన్న వాదన పట్టణ, పల్లెల్లో వినిపిస్తోంది. జిల్లాలో తణుకు, పాల కొల్లు, భీమవరం, టీపీగూడెం పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ పట్టణాల్లో కూడా పోటీ చేద్దామని ఆలోచిస్తున్న అభ్యర్థులు కూడా సాయంతో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆసక్తి చూపక పోవడం గమనార్హం.  


కర్ఫ్యూతో  కష్టాలు

కడుపు మాడ్చుకుంటున్న పోలీసులు 

పాలకొల్లు, మే 17 : కరోనా ఉధృతిని తగ్గించ డానికి రోజుకు 18 గంటలు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో డ్యూటీలో ఉన్న పోలీసులు సమయానికి ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో దాతలు, స్వచ్చంద సంస్థలు పోటీపడి పోలీసులకు, వైద్యసిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు ఇలా సేవలందించే అన్నివర్గాల ఉద్యో గులు, వలంటీర్లకు స్వచ్చందంగానే ఆహారం అందజేశారు. ఐతే ఇప్పడు దాతలు కరువయ్యారు. కర్ఫ్యూతో ఉదయం 11 గంటలకే షాపులన్నీ మూసి వేయడంతో పట్టణాలల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు  అల్పాహారం, భోజనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇంటి నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి ఆహారంతో పొట్ట నింపుకుంటుండగా మరికొందరు తినడానికి ఆహారం దొరక్క కడుపు మాడ్చుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చేంత వరకూ శాఖాపరంగానైనా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆహారం అంద జేయాలని కొంతమంది సూచిస్తున్నారు. 


Updated Date - 2021-05-18T05:38:09+05:30 IST