గ్రంథాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-10-30T04:49:08+05:30 IST

గ్రంథాలయ ఉద్యోగుల సమస్యల పరి ష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు.

గ్రంథాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సాబ్జీ, గ్రంథాలయ సంస్థ నాయకులు

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ 

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 29 : గ్రంథాలయ ఉద్యోగుల సమస్యల పరి ష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. ఏపీ ఎన్జీవో హోంలో శుక్రవారం ఏపీ రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం సమా వేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ గ్రంథా లయ ఉద్యోగులకు 010 ఖాతా ద్వారా జీతాలు చెల్లింపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అతిథులుగా ఎన్జీవో సంఘం జిల్లా సంఘం అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరి నాథ్‌, జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

నూతన కార్యవర్గం..

జిల్లా అధ్యక్షుడిగా గురిందపల్లి రాంబాబు, మహిళా అధ్యక్షులుగా యు.రాముడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎండీ జుల్‌ఫికర్‌ ఆలీ, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా శోభా మణిపురి, కోశాధికారిగా ఎన్‌సీహెచ్‌ రామకృష్ణ, అసోసియేట్‌ అధ్యక్షుడిగా వేముల వెంకటరత్నం, ఉపాధ్యక్షులగా ఎస్‌ డీ లతీఫ్‌, ఘంటసాల బాలరాజు, కొండే వెంకటేశులు, పి.రంగారావు, సహాయ కార్యదర్శిగా వెంకటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా దుర్గారావు, సహాయ కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా దుర్గారావు, కార్యవర్గ సభ్యులుగా జి.అనిత, కె.నాగశిరోమణి, ఎం.భీమరాజు, అయ్యప్ప, ఎస్‌.ప్రవీణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - 2021-10-30T04:49:08+05:30 IST