మెర్రీ క్రిస్మస్‌

ABN , First Publish Date - 2021-12-25T06:15:35+05:30 IST

నేడు క్రిస్మస్‌. ఈ పండుగను పురస్క రించుకుని చర్చిలన్నీ ముస్తాబయ్యా యి.

మెర్రీ క్రిస్మస్‌
ఏలూరు మన్నా చర్చిలో ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు

అంబరాన్నంటిన వేడుకలు.. ప్రత్యేక ప్రార్థనలు

ముస్తాబైన చర్చిలు.. పాస్టర్ల ప్రబోధనలు

జిల్లా కలెక్టర్‌ కార్తికేయ శుభాకాంక్షలు


జంగారెడ్డిగూడెం, డిసెంబరు 24 : నేడు క్రిస్మస్‌. ఈ పండుగను పురస్క రించుకుని చర్చిలన్నీ ముస్తాబయ్యా యి. ప్రధాన కూడళ్ళలో భారీ నక్షత్రాలను ఏర్పాటుచేసి విద్యుత్‌ వెలుగులు అద్దుతున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏసు పుట్టుకను తెలిపే పశువుల పాకల నమూనాలను సిద్ధం చేశారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రిస్మస్‌ ట్రీలు, స్టార్స్‌ విక్రయించే దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. మానవుల పాప విమోచన కోసం తన ప్రాణాలనే శిలువపై అర్పించి, పునరుత్ధానుడైన ఏసును లోక రక్షకుడిగా భావించి ఈ వేడు కను జరు పుకుంటున్నట్టు మత ప్రబోధకులు చెబుతు న్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి చర్చిలో ప్రార్ధనలు మొదలయ్యాయి. 12 గంటలకు క్రీస్తు జననాన్ని చాటుతూ కొవ్వొత్తులు చేతబట్టి పాటలు పాడుతూ వీధుల్లో తిరిగారు. శని వారం ఉదయం నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన లు, సందేశాలను ఇవ్వనున్నారు. క్రిస్మస్‌ పర్వది నాన్ని పురస్కరించుకుని ఒకరికొకరు శుభాకాం క్షలు చెప్పుకున్నారు. మంత్రులు ఆళ్ల నాని, చెరు కువాడ రంగనాథరాజు, తానేటి వనిత క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


వేడుకల్లో కలెక్టర్‌ 

ఏలూరు బిషప్‌ హౌస్‌లో కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకలను ప్రారంభిం చిన జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా. శుక్రవారం సాయంత్రం గ్జేవియర్‌ నగర్‌లోని బిషప్‌ హౌస్‌ కలెక్టర్‌ కుటుంబ సభ్యులతో హాజరై కేక్‌ కట్‌ చేసి అల్ఫాహారం స్వీకరించారు. కలెక్టర్‌ జిల్లా ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభువు  ప్రజలందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఏలూరు పీఠాధిపతి బిషప్‌ జయరావు, పాదర్‌ మోజేస్‌, ఫాదర్‌ మైకేల్‌, ఫాదర్‌ రాజు, ఫాదర్‌ పీటర్‌,  ఫాదర్‌ స్టీవెన్‌, ఫాదర్‌ స్టీపెన్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-25T06:15:35+05:30 IST