మందుల షాపునకు సీలు

ABN , First Publish Date - 2021-05-03T04:52:04+05:30 IST

నాసిరకం పల్స్‌ ఆక్సీమీటర్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు నిర్ధారణ కావడంతో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లోని ఒక మందుల షాపునకు అధికారులు శనివారం రాత్రి సీలు వేశారు.

మందుల షాపునకు సీలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 2 : నాసిరకం పల్స్‌ ఆక్సీమీటర్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు నిర్ధారణ కావడంతో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లోని ఒక మందుల షాపునకు అధికారులు శనివారం రాత్రి సీలు వేశారు. మీడియాలో ప్రసా రమైన కథనంపై కలెక్టర్‌ స్పందించి జారీ చేసిన ఆదేశాల మేరకు తహసీ ల్దార్‌ సోమశేఖర్‌, ఎంహెచ్‌వో డాక్టర్‌ గోపాల్‌ నాయక్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అలీ   మెడికల్‌ స్టోర్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అభియోగాలు రుజువు కావ డంతో షాపునకు సీలు వేసినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-03T04:52:04+05:30 IST