రాష్ట్ర క్రికెట్ జట్టుకు భూపతిరాజు మనీష్ వర్మ ఎంపిక
ABN , First Publish Date - 2021-10-30T04:51:39+05:30 IST
అనంతపురంలో ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరిగిన అండర్–25 ప్రాపబుల్స్ రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్‌ల్లో జిల్లాకు చెందిన భూపతిరాజు మనీష్‌వర్మ అద్భుతంగా రాణించి బీసీసీఐ అండర్–25 రాష్ట్ర జట్టుకు ఎంపికైన ట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రా మరాజు తెలిపారు.

ఏలూరు స్పోర్ట్స్, అక్టోబరు 29 : అనంతపురంలో ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరిగిన అండర్–25 ప్రాపబుల్స్ రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్‌ల్లో జిల్లాకు చెందిన భూపతిరాజు మనీష్‌వర్మ అద్భుతంగా రాణించి బీసీసీఐ అండర్–25 రాష్ట్ర జట్టుకు ఎంపికైన ట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రా మరాజు తెలిపారు. భీమవరం సమీపంలోని కోడవల్లి గ్రామానికి చెందిన మనీష్ వర్మ ఆల్‌రౌండ్ ప్రతిభతో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఆంధ్రా యూనివర్శిటీకి మూడేళ్లు ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన సందర్భంగా అసో సియేషన్ గౌరవ సభ్యులు విద్యా ప్రసాద్, ఎం.వగేష్‌కుమార్, కె.రామ్‌చంద్, మం గేష్, తదితరులు అభినందనలు తెలిపారు.