ఫ్యాన్లు తిరగవు..లైట్లు వెలగవు

ABN , First Publish Date - 2021-05-18T05:35:45+05:30 IST

నిత్యం ఆ ఏరియాలో విద్యుత్‌ సమస్యే.. రాత్రి సమ యాల్లో అయితే మరీ దారుణం. ఫ్యాన్లు సరిగ్గా తిరగవు. విద్యుత్‌ పరికరాలు దగ్ధం అవుతూనే ఉంటాయి.

ఫ్యాన్లు తిరగవు..లైట్లు వెలగవు
కొవ్వాడ పుంతలోని ఒక వీధి

లోవోల్టేజీతో కొవ్వాడ పుంత వాసుల ఇక్కట్లు

 భీమవరం క్రైం, మే 17 : నిత్యం ఆ ఏరియాలో విద్యుత్‌ సమస్యే.. రాత్రి సమ యాల్లో అయితే మరీ దారుణం. ఫ్యాన్లు సరిగ్గా తిరగవు.  విద్యుత్‌ పరికరాలు దగ్ధం అవుతూనే ఉంటాయి. విద్యుత్‌శాఖ అధికారులకు ఈ సమస్య పట్టడం లేదు.  భీమవరం సమీపంలోని కొవ్వాడ పుంతలో సుమారు పదేళ్ల క్రితం లేఅవుట్‌లు వేశారు. వాటికి పంచాయతీ  ఆధ్వర్యంలో కరెంటు పోల్స్‌ను వేసి సింగిల్‌ లైన్‌ కరెంటు లైన్‌ వేశారు.  అప్పటికి ఒకటి రెండు ఇళ్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నివాసాలు పెరుగుతూ ఉండటంతో విద్యుత్‌ సమస్య తలెత్తుతోంది. సాయంత్రం అయితే చాలు లైట్లు వెలగని పరిస్థితి. ఫ్యాన్‌లు సరిగ్గా తిరగవు.. రాత్రివేళ నిద్రపట్టక నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్భాఆల్లో ఎలక్ర్టానిక్‌ వస్తువులు కాలిపోతుంటాయి.. 


నిత్యం లోవోల్టేజీ సమస్యే : శ్రీనివాసరావు

కొవ్వాడ పుంతలోని కొన్ని వీధుల్లో నిత్యం లోవోల్టేజీ సమస్య తప్పడం లేదు. సాయంత్రం అయితే చాలు ఫ్యాన్‌లు తిరగక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు.. సింగిల్‌ లైన్‌  మార్చకపోతే ఇబ్బందులు తప్పవు. 


విద్యుత్‌ పరికరాలు దగ్ధం అవుతున్నాయి : బండారు మధు 

కొవ్వాడ పుంతలో కొన్ని వీధుల్లో సింగిల్‌ ఫేస్‌ కావడంతో లోవోల్టేజీ సమస్య ఇబ్బందికరంగా మారింది. విద్యుత్‌ పరికరాలు దగ్ధం అవుతున్నాయి. స్థానికంగా ఉన్న అధికారులకు సమస్య గురించి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. 


సమస్య తీరేదెప్పుడు : సుబ్బారావు 

ఈ సమస్య కొన్నేళ్ళుగా కొనసాగుతునే ఉంది. కాని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం టుఫేజ్‌గా మార్చితే కొంత ఇబ్బంది తగ్గుతుందని చెబుతున్నా ఫలితం లేదు. సాయంత్రం రాత్రి సమయాల్లో చిన్నారులు గాలి ఆడక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. 


Updated Date - 2021-05-18T05:35:45+05:30 IST