కుల పెద్దల మాయాజాలం

ABN , First Publish Date - 2021-02-06T05:59:17+05:30 IST

రజకుల కుల పెద్దలుగా వ్యవ హరిస్తూ వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు ఇప్పిస్తా మని చెప్పి వారి పేరుపై దరఖాస్తులను పెట్టి బ్యాంకు అధికా రులు, రుణాలు మంజూరు చేసే అధికారులతో కుమ్మక్కై మోసగించిన కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేశామని ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌ చెప్పారు.

కుల పెద్దల మాయాజాలం
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ దిలీప్‌

 సభ్యుల పేరిట బ్యాంకుల్లో రుణాలు.. 

మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి..

ఆరుగురు నిందితుల అరెస్టు

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 5: రజకుల కుల పెద్దలుగా వ్యవ హరిస్తూ వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు ఇప్పిస్తా మని చెప్పి వారి పేరుపై దరఖాస్తులను పెట్టి బ్యాంకు అధికా రులు, రుణాలు మంజూరు చేసే అధికారులతో కుమ్మక్కై మోసగించిన కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేశామని ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌ చెప్పారు. డీఎస్పీ కార్యాల యంలో శుక్రవారం  విలేకరుల సమావేశంలో కేసు వివరాల ను వెల్లడించారు. ఏలూరు చాణిక్యపురి కాలనీకి చెందిన తామాడ లక్ష్మీనరసింహారావు, తామాడ లక్ష్మణరావు, వెంపటి తేజ, తామాడ సరస్వతులు కలిసి రజకులకు రుణాలు ఇప్పి స్తామని వారి గ్రూపులను ఏర్పాటుచేసి వారికి తెలియకుం డానే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రుణాలు మంజూరు చేసే ప్రాజెక్టు ఆఫీసర్‌తో కుమ్మక్కై సబ్సిడీ రుణాలను మంజూరు చేయించుకుని, బ్యాంకు అధికారులతో చేతులు కలిపి సబ్సిడీ రుణాలను లక్షలాది రూపాయలు తీసేసుకున్నారు. ఆ రుణాలు తిరిగి కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు రుణాలు తీసుకున్నట్లు పేర్లు ఉన్న వారికి బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ వారికి పెద్దలుగా వ్యవహరించిన లక్ష్మణరావు, లక్ష్మీనరసింహా రావులను నిలదీశారు. వారు సమాధానం చెప్పకపోవడంతో ఏలూరు చాణిక్యపురి కాలనీకి చెందిన కాళింగపట్టణం కనక అనే మహిళ ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులకు గత నెల 19న ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురిని గత నెల 22వ తేదీన అరెస్ట్‌ చేశారు. వారికి సహకరించిన ఏలూరులోని ఏడుగోలీల సెంటర్‌ డీసీసీబీ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రస్తుతం సత్రంపాడు డీసీసీబీలో పనిచేస్తున్న ముళ్ళపూడి మురళీకృష్ణ, రిటైర్డ్‌ డీసీసీబీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ పీఎస్‌బీ నాగకుమార్‌ అలియాస్‌ చిట్టిబాబు, డీసీసీబీ అసిస్టెంట్‌ మేనేజర్‌ వారణాశి శ్రీరామ్‌గోపాల్‌, అప్పటి ఏలూరు మున్సిపాలిటీలో ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రస్తుత రెవెన్యూ ఆఫీసర్‌ నలమిల్లి విజయభాస్కరరావు, బ్యాంకు గ్యారెంటర్లగా ఉన్న తాడేపల్లిగూ డెంకు చెందిన కోట అచ్యుత రామారావు, ఏలూరునకు చెంది న నాసక శ్రీనివాసరావులను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు డీ ఎస్పీ చెప్పారు. ఒక్కో గ్రూపులో 15 మంది సభ్యులు ఉండగా గ్రూపుకు రూ.30 లక్షల రూపాయల నిధులు తీసుకున్నారని, వంద మంది వరకూ బాధితులు ఉన్నారని భావించారు. ప్రతి రుణంపై 50 శాతం సబ్సిడీ ఉన్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-02-06T05:59:17+05:30 IST