చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-10-21T04:33:31+05:30 IST

మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నా యని వాటిపై అవగాహన పెంచుకుని తమ హక్కులను కాపాడుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డి.బాలకృష్ణయ్య అన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జడ్జి బాలకృష్ణయ్య

 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బాలకృష్ణయ్య

ఏలూరు క్రైం, అక్టోబరు 20 : మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నా యని వాటిపై అవగాహన పెంచుకుని తమ హక్కులను కాపాడుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డి.బాలకృష్ణయ్య అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా బాధితుల పరిహార పథకం అనే అంశంపై ఏలూరు అర్బన్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు న్యాయ విజ్ఞాన సదస్సును జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయసేవాసదన్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి డి.బాలకృష్ణయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ఇతర మహిళలపై, పోక్సో కేసులలో బాధితులకు చట్ట ప్రకారం పరిహారం అందజేయబడు తుందని కేసు విచారణ జరిగే లోపు మధఽ్యంతర పరిహారం అందజేయబడుతుం దన్నారు.  అంగన్‌వాడీ కార్యకర్తలు చట్టాలపై అవగాహన పెంచుకుని తమ వద్దకు వచ్చే గర్భిణులు, పిల్లల సంరక్షకులకు తెలపాలన్నారు. కార్యక్రమంలో కూనా కృష్ణారావు, కేఎస్‌ నాగలక్ష్మి, జీవీ భాస్కర్‌, కె.మనోహర్‌, పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-21T04:33:31+05:30 IST